ఖాళీ అవుతున్న వైసీపీ? సంబుర పడుతున్న ఆ పార్టీ !

Chakravarthi Kalyan

ఏపీలో కానీ దేశంలో కానీ ఎప్పుడు రెండే పార్టీల వ్యవస్థ ఉంటుంది. అది ఒకటి అధికార పక్షం. రెండోది ప్రతిపక్షం. అధికార పక్షం మీద మొహం  మొత్తితే  విపక్షానికి జనాలు జై కొడతారు. ఇతర పార్టీలు ఎన్ని ఉన్నా వారికి అధికారం దక్కడం కొంత కష్టంగానే ఉంటుంది. ఏపీలో చూస్తే టీడీపీ కూటమి పేరుతో బీజేపీ, టీడీపీ, జనసేన జట్టు కట్టాయి. ఇవి రాజకీయ అవసరాల కోసం ఏర్పడినవి అనే విషయం తెలిసిందే.


ఆ రోజు ఎదురుగా వైసీపీ ఉంది కాబట్టి.. దాన్ని గద్దె దించడం కోసం ఆ పొత్తు పొడిచింది. ఎల్లకాలం ఇది కొనసాగుతుందని అని ఎవరూ అనుకోరు. బీజేపీకి అధికారం మీద ఆశ ఉంది. జనసేనకు పవర్ కావాలి. అయితే టీడీపీ కూటమికి వైసీపీ పోటీ ఇచ్చేంత వరకు ఈ కూటమిలో సయోధ్య కొనసాగుతూనే ఉంటుంది.


ఎందుకంటే  ఛాన్స్ దొరికితే మళ్లీ వైసీపీ బలపడి అధికారంలోకి వస్తుంది అన్న బెంగ ముగ్గురు మిత్రుల్లోను ఉంటుంది. ఆ బెంగ అనే సిమెంట్ తోనే కూటమి భవనం అతుక్కొని పటిష్ఠంగా ఉంది. 2029లోను టీడీపీ కూటమి పోటీ చేస్తుందని ఎన్నికల ముందే పవన్ చెప్పేశారు. టీడీపీతో పొత్తు పదేళ్ల పాటు కొనసాగాలని కూడా ఆయన ఆకాంక్షించారు. కానీ ఏపీలో చూస్తుంటే కేవలం మూడు నెలలు గడవకముందే వైసీపీ అనే రాజకీయ సౌధం పేక మేడ మాదిరిగా కూలుతోంది.


మేం అక్కడ బడా నాయకులం.. పార్టీ ఫౌండేషన్ నుంచి ఉన్న లీడర్లు సైతం పేగు బంధం తెంచుకొని బయటకు వచ్చేస్తున్నారు.  వైసీపీ తొందరలోనే ఇంత పతనం చెందుతుందని ఎవరూ ఊహించలేదు. ఇలా వైసీపీ తగ్గిపోవడం టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ ఖుషీ ఇస్తోంది. ఎందుకంటే వైసీపీ బలహీనం అయితే బలపడేది జనసేనే కాబట్టి. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇప్పుడు వైసీపీ బలహీన ప్రతిపక్షం అయితే ఆ స్థానంలోకి వెళ్లేందుకు జనసేన కచ్ఛితంగా ప్రయత్నిస్తుంది. అప్పుడు ఏపీలో టోటల్ ముఖ చిత్రమే మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: