ఇలా చేస్తేనే వైసీపీ గట్టెక్కుతుందా? మరి జగన్ వ్యూహం ఏంటి?
రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం అని అంటారు. ఇలాగే వయసు కూడా ముఖ్యమని కొత్తగా అర్థం అవుతుంది. రాజకీయాలు ఎవరైనా ఒక వయసులోనే చేస్తారు. అలాగే చేయాలని అనుకుంటారు. పైగా రాజకీయాల్లో చూస్తే ఎప్పుడు ఏమి జరుగుతుంతో ఎవరికి తెలియదు. ఇదంతా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు ఎప్పుడు రాజు అవుతారో తరాజు అవుతారో అర్థం కాదు. అసలు తెలియదు.
అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న సామెత ఉంది. అదే పని ఎప్పుడు రాజకీయ నేతలు చేస్తుంటారు. దాన్నే టైమింగ్ అని అంటారు. ఇక వైసీపీ పరిస్థితి చూస్తుంటే జగన్ నాయకత్వంలో ఉన్న పార్టీ. జగన్ వయసు అయిదు పదుల మాటే. ఆయన రాజకీయంగా చూస్తే యువకుడే. కానీ ఆయన పార్టీలో ఉన్నం వారు అంతా ఆ ఏజ్ లో లేరు. వారిలో ఆరు పదులు దాటిన వారు రాజకీయంగా సీనియర్ మోస్టు లీడర్లు ఉన్నారు.
వారికి మాత్రం ఈ సారి ఎన్నికల్లో పరాజయం షాక్ గానే ఉంది. మరొ అయిదేళ్లు కళ్లు మూసుకుంటే ఇట్టే గడిచిపోతాయి అని జగన్ అధినేత హోదాలో చెప్పొచ్చు. కానీ అయిదేళ్లు అన్నవి అధికారంలో ఉంటే కరిగిపోతాయి కానీ విపక్షంలో ఉన్నప్పుడు కాదు. ఒక్కో దినం కడు భారం అవుతోంది.
ఇక సీనియర్ నేతలు తమ వారసులను తయారు చేసుకును పనిలో పడ్డారు. తాము కాస్తా పలుకుబడిలో ఉన్నప్పుడే వారికి రాజకీయ బాట చూపించాలని అనుకుంటున్నారు. మరో అయిదేళ్లు ఓడినా పార్టీలో ఉన్నా అప్పటికీ అవకాశాలు రాకపోతే.. లేదా మరోసారి పరాజయం పాలైతే అప్పుడు తమ సంగతేంటి అన్న చింత వారిలో కనిపిస్తుంది.
వైసీపీ ఇప్పుడు చేయాల్సింది వయసు బెంగ లేని నేతలను చేరదీయడం. పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలను అవకాశాలు ఇవ్వడం. జగన్ తనతో పాటు వచ్చిన కాంగ్రెస్ నేతల రుణం తీర్చుకున్నారు. అందువల్ల నాడు ఎన్టీఆర్ చేసినట్లు కొత్త రాజకీయానికి, కొత్త రక్తాకిని పార్టీలో చోటివ్వాలని విశ్లేషకులు సూచిస్తునారు.