బీసీలకు కొత్త పార్టీ.. చంద్రబాబు,, రేవంత్ లు తట్టుకోగలరా?

Chakravarthi Kalyan

తెలుగు రాష్ట్రాల్లో బీసీ నేతగా పాపులర్ అయిన ఆర్ కృష్ణయ్య వైసీపీ తో బంధం తెంచుకున్నారు. ఆయన వైసీపీ నుంచి సంక్రమించిన రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజకీయ పయనం ఎటు అన్నది ఇప్పుడు చర్చ మొదలైంది. కృష్ణయ్య బీజేపీలో చేరుతారు అనే ఒక ప్రచారం అయితే  ఉంది. ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వం ఇంకో నాలుగేళ్లు ఉంది. పెద్దల సభలో కృష్ణయ్య ఉండాలని అనుకోవడం గొప్ప  గౌరవం.


మరి ఆ ఎంపీ పదవిని ఆయన తిరిగి కూటమి ఖాతాలో వేసుకుంటారా లేక వేరే పదవులు ఆయనకు ఇస్తారా అన్నది కూడా ఇప్పుడు చర్చగా ఉంది. అయితే విస్త్రృతంగా జరుగుతున్న మరో ప్రచారం ఏంటంటే.. కృష్ణయ్య గవర్నన్ పదవి కోరవచ్చు అని… అంటే బీజేపీలో చేరి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వెళ్లాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు.


అలా ఆయన వదిలేసిన రాజ్యసభ స్థానానికి మరో బీజేపీ నేతని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దాంతో వివిద రాష్ట్రాల్లో గవర్నర్ పదవులు ఖాళీ అయితే వాటిని బీజేపీ తమ నాయకులతో భర్తీ చేస్తుంది. అలా కృష్ణయ్యకు గవర్నర్ పదవి దక్కవచ్చని అంటున్నారు.


ఇక ఆయన సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేస్తారని అంటున్నారు. పార్టీ పెట్టేందుకు ఇదే సరైన సమయం అని ఆయన భావిస్తున్నారు అంట. దీనిపై కసరత్తులు కూడా చేస్తున్నారని సమాచారం. అయితే పార్టీ స్థాపన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కృష్ణయ్య స్పష్టం చేశారు. మరో వైపు ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి ముఖ్య కారణం బీసీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి.. బలోపేతం చేసేందుకు అని కూడా అంటున్నారు. కానీ వైసీపీ మద్దతు దారులు ఆయన నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. కృష్ణయ్య తమ పార్టీకి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. ఇప్పుడు ఆయన అడుగులు ఎటు పడబోతున్నాయి అని రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: