చంద్రబాబు ఉచ్చులో జగన్! ఆ విషయంలో అతిగా స్పందించి ఇరుక్కుపోయారా?
టీటీడీ లడ్డూ విషయంలో వైసీపీ అనవసరంగా కలుగ జేసుకుందా? తెలుగుదేశం ట్రాప్ లో పడిందా? ఆ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందా? వైసీపీ స్పందించడంతోనే అసలు సమస్య వచ్చి పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీటీడీ లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు చేసింది టీడీపీ.
సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించేవరకు వైసీపీ అలెర్ట్ అయింది. జగన్ బయటకు వచ్చి మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయింది వైసీపీ. టీటీడీ అనేది ఒకస్వయం ప్రతిపత్తి గల సంస్థ. తనకు తాను నిర్ణయాలు తీసుకునేందుకు ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఐఏఎస్ అధికారులతో సమానమైన వారిని ఈవోలు, జేఈవోలుగా నియమించారు. టీటీడీలో జరిగే ప్రతి నిర్ణయం వారిదే.
అయితే టీటీడీ లడ్డూ విషయంలో వైసీపీ ప్రభుత్వ చర్య అన్నట్లు పరిస్థితిని మార్చేశారు. కేవలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్లుగా పనిచేసిన వై.వీ. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్పందించి ఉంటే బాగుండేది. కానీ వైసీపీ అధినేత జగన్ ఎంటర్ అయ్యారు. అదంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని అర్థం వచ్చేలా వ్యవహరించారు. ఈ విషయంలో చంద్రబాబు ట్రాప్ లో పడ్డారు.
లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలసింది అన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఇది ఆరోపణ మాత్రమే. దీనికి ప్రామాణికమైన నిర్ధారణ అంతవరకు జరగలేదు. గుజరాత్ ల్యాబ్ నిర్ధారించింది అంటూ టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. దీనిపై కరుణాకర్ రెడ్డి మాత్రమే స్ర్టాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సత్య ప్రమాణం కూడా చేశారు. వైవీ సుబ్బారెడ్డి ఆ స్థాయిలో మాత్రం స్పందించలేదు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ అతిగా స్పందించారు. జరిగిన ఘటనను ఖండించి.. విచారణకు స్వాగతించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ టీటీడీ వ్యవహారాన్ని వైపీపీ ప్రభుత్వ వ్యవహారంగా మార్చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో టీడీపీ ట్రాప్ లో పడ్డారు జగన్ అని విశ్లేషకులు అంటున్నారు.