అట్లుంటది ఇజ్రాయెల్ తో? హమాస్ అధినేతని కూడా లేపేశారుగా..?
గతేడాది అక్టోబరు 6న తేదీ వరకు ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉంది. తమ పని తాము చేసుకుంటూ పోతుంది. ఈ సమయంలో పాలస్తీనాలోని హమాస్ అక్టోబరు 7న ఇజ్రాయెల్ సరిహద్దుపై దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది మరణించారు. 250 మందిని హమాస్ సైన్యం బందీలుగా తీసుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ ఆరోజే స్పష్టం చేసింది.
హమాస్ అంతమే లక్ష్యంగా సైనిక చర్యను చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాలస్తీనాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తూ వస్తోంది. మధ్యలో కొన్ని రోజులు విరామం ఇచ్చినా… హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టాలన్న లక్ష్యాన్ని మాత్రం విస్మరింలేదు. హమాస్ ను నడిపిస్తున్న కమాండ్లను అంతం చేస్తూ.. బందీలను విడిపించుకుంది. బందీలు విడుదల అయినా ఇజ్రాయెల్ మాత్రం దాడులు ఆపలేదు. సొరంగాల్లో దాక్కొన్న కీలక కమాండర్లందనీ వెతికి మరీ పట్టుకొని అంతం చేసింది.
తాజాగా అక్టోబరు 7న జరిపిన దాడుల్లో హమాస్ చీఫ్ యహ్వా సిన్వార్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ గురువారం ప్రకటించారు. గాజాలోని సైనిక ఆపరేషన్ లో ఇజ్రాయెల్ ను ఐడీఎఫ్ హతమార్చినట్లు ప్రకటించారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ణారణ చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి యహ్వా సిన్వారే కీలక సూత్రధారి. నాటి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా సారథ్యంలో ఈ దాడి జరిగింది. తర్వాత ఇజ్రాయెల్ ఒక్కొక్కరిని అంతం చేసింది. ఈ క్రమంలోని ఇరాన్ లోని టెహ్రాన్ దాక్కున్న హమాస్ చీఫ్ హనియాను జులై 31న ఐడీఎఫ్ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా హతమార్చింది. దీంతో యహ్వా సిన్వార్ ను ఆగస్టులో హమాస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ మేరకు అతడిని ఐటీఎఫ్ టార్గెట్ చేసింది. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ బందీల మధ్య దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి.
గాజాపై యుద్దం ప్రారంభించిన సమయంలోనే హమాస్ అగ్ర నేతలందరినీ హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఙ చేసింది. ఈ క్రమంలో ఒక్కొక్కరినీ వేటాడుతూ వచ్చింది. హమాస్ రాజకీయ వ్యవహారాల అధిపతి ఇస్మాయెల్ హనియాను ఇటీవల టెహ్రాన్ మట్టుపెట్టింది.