కంచు కోటల్లో ఓట్లు కొల్లగొడుతున్న కమలా హారిస్? పోటీ ఇవ్వలేకపోతున్న ట్రంప్?

Chakravarthi Kalyan

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటివరకు మొత్తం మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఈ మూడు చోట్లా మిశ్రమ ఫలితాలే వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదనే సంకేతాలు ఇచ్చాయి.


అధికారంలోకి రావడానికి ప్రతి స్టేట్‌లోనూ 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరమౌతాయి. మొత్తం 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో ఏడు మాత్రమే అధ్యక్షుడిని నిర్ధారిస్తాయి. మిగిలిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు స్టాండర్డ్ ఓటుబ్యాంక్ ఉండటమే దీనికి కారణం. అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవడాల్లో అధిక శాతం ఓట్లను పొందిన వాళ్లదే విజయం.


అన్నిటికంటే ముందు కెంటకీ, ఇండియానా, వెర్మాంట్‌లల్లో పోలింగ్ ముగిసింది.  ఈ రెండు చోట్ల కూడా డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యతలో కనిపించారు. కెంటకీలో 68 శాతంతో 72,945, ఇండియానాలో 57.6 శాతంతో 1,77,496 ఓట్లు పడ్డాయి.


కెంటకీ కమలా హ్యారిస్‌కు 34, 108, ఇండియాలో 1,26,570 ఓట్లో పోల్ అయ్యాయి. కెంటకీ, ఇండియానాల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ రెండింటినీ తన ఖాతాలో వేసుకున్నారు. సహజంగా ఈ రెండు రాష్ట్రాలు కూడా డీప్ రెడ్‌కు చెందనవే. రిపబ్లికన్లకు గట్టిపట్టు ఉన్నవే. ఇక్కడ ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.


వెర్మాంట్‌లో కమలా హ్యారిస్ బోణీ కొట్టారు. తన సమీప ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై భారీ మెజారిటీతో దూసుకెళ్తోన్నారు.  ఆయనకు అందనంత ఎత్తులో ఓట్లను కొల్లగొట్టారామె. ప్రస్తుతం కమల హ్యారిస్‌కు 12,579 ఓట్లు పోల్ కాగా.. డొనాల్డ్ ట్రంప్‌కు 5,644 ఓట్లు పడ్డాయి. ఇద్దరి మధ్యా 30 శాతానికి పైగా తేడా ఉంటోంది. 1988 తరువాత ఏ ఒక్క రిపబ్లికన్ అభ్యర్థి కూడా వెర్మాంట్‌లో గెలవలేదు.


అలబామా, జార్జియా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో పోలింగ్ తుదిదశకు చేరుకుంది. ఇండియానాలోని గిబ్సన్, జాస్పర్, లేక్, లాపొర్టె, న్యూటౌన్, పెర్రీ, పోర్టర్, పోసె, స్పెన్సర్, స్టార్క్, వాండెర్బర్గ్, వార్రిక్‌లల్లో పోలింగ్ ముగిసినట్లు ఎలక్టోరల్ కాలేజీ వెల్లడించింది.


7 గంటలకు జార్జియా, సౌత్ కరోలినా, వర్జీనియా, ఫ్లోరిడా, 7:30 గంటలకు నార్త్ కరోలినా, ఓహియో, వెస్ట్ వర్జీనియా, రాత్రి 8 గంటలకు అలబామా, కనెక్టికట్, డెలావెర్, కొలంబియా, ఇల్లినాయిస్, కన్సాస్, మేరీల్యాండ్, మిస్సిస్సిపి, న్యూజెర్సీ, ఓక్లహామా, రోడ్స్ ఐలండ్, కొలరాడో, మిన్నెసోటా, న్యూయార్క్‌ వంట రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: