ఉత్తమ్ ని పొగిడిన రాహుల్? ఆంతర్యం అదే నా?
ఇటీవల బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి పట్టు సడలుతోందని పేర్కొంటూ ఆయనకు అధిష్టానం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వివరిస్తూ... త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని వెల్లడించారు. దీనితో పాటుగా ముఖ్యమంత్రి పదవి రేసులో ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు.
తాజాగా రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రసంశించారు. తెలంగాణలో జరగబోయే కులగణన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసిన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రసంగించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనువదించారు. రాహుల్ అభిప్రాయాలను ఆయన హాజరైన వారికి తెలుగు భాషలో వ్యక్తీకరించారు. రాహుల్ తన ప్రసంగం ముగిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందించారు. తన ప్రసంగాన్ని చక్కగా అనువదించారని ఉత్తమ్ ను మెచ్చుకుంటూ ఎక్స్లెంట్ ప్రజెంటేషన్ అంటూ కితాబు కూడా తెలిపారు.
రాహుల్ గాంధీ పీసీసీ మాజీ అధ్యక్షుడికి ఇచ్చిన ప్రశంస సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ గతంలో రేవంత్ రెడ్డి వైపు ఉండగా ఇప్పుడు అది మారుతోందా? తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాల అభిప్రాయాలు, ఆందోళనలు పరిగణలోకి తీసుకోవడమే దీనికి కారణమా? రేవంత్ తర్వాత పరిశీలించబోయే పేరు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అయిన అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.