చంద్రబాబు ఎఫెక్ట్..! ఇక రోడ్డెక్కితే బాదుడే?
కూటమి ప్రభుత్వంలో రోడ్లు కూడా అలాగే ఉన్నాయి. మొత్తం రోడ్లను బాగు చేయించాలీ అంటే ఖజానాలో సొమ్ములు లేవు. దాంతో గుంతలు పూడ్చడానికి అన్నట్లుగా 850 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి. అయితే ఇవి సరిపోవని అంటున్నారు. ఏపీ రోడ్లు నిర్మించాలంటే వేల కోట్లు ఖర్చు అవుతాయి. అందుకే చంద్రబాబు తన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలతో ఒక ప్రతిపాదన పెట్టారు.ఏపీలోని రోడ్లను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇద్దామన్నది ఆ ప్రతిపాదన. ఆ విధంగా చేస్తే కనుక రోడ్లు బంగారంగా తయారు అవుతాయి. అయితే టోల్ ఫీజు చెల్లించాలి. కానీ ఇది కూడా కార్లు బస్సులు కార్లు వంటి వాహనాలే పరిమితం చేద్దామని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. ఇక బైకులు ట్రక్కులు, ట్రాక్టర్లు ఆటోలకు టోల్ ఫీజు ఉండదని చెబుతున్నారు.
అంతే కాదు గ్రామాలలో మండలాలలో అసలు టోల్ ఫీజు అన్నదే ఉండదని మరో మినహాయింపు ఇచ్చారు చంద్రబాబు. ఇది పైలెట్ ప్రాజెక్ట్ గా గోదావరి జిల్లాల నుంచే స్టార్ట్ చేద్దామని ఆయన అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రజలను ఒప్పించాల్సింది ప్రజా ప్రతినిధులే అని బాబు అన్నారు. ఇది సమ్మతం కాకపోతే తనకేమీ అభ్యంతరం లేదు అని మళ్ళీ గుంతల రోడ్ల మీదనే తిరగాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు.
టోల్ ఫీజు అంటే ప్రజలలో అసహనం కనిపిస్తుంది అని అంటున్నారు. బస్సులకు టోల్ ఫీజు వేసినా అందులో ప్రయాణించేది సామాన్యులే కదా అని అంటున్నారు. వారి టికెట్ మీదనే ఆ భారం పడుతుందని అంటున్నారు ఇక కార్లు ఈ రోజులలో మధ్యతరగతి వారికీ ఉన్నాయని చెబుతున్నారు. లారీలకు టోల్ ఫీజు పెడితే వారు కూడా నిరసనలు వ్యక్తం చేస్తారు అని అంటున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా అన్నది ఆలోచించాల్సిందే అని అంటున్నారు.