శబరిమలలో భారీ వర్షాలు..! అయ్యప్ప భక్తులకు కీలక అలెర్ట్? ఈ విషయాలు గుర్తుంచుకోండి?

Chakravarthi Kalyan

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దీని ప్రభావం కేరళ పైన కూడా పడుతుంది. కేరళలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనం తిట్ట జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శబరిమల కు వెళుతున్న అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


అయ్యప్ప భక్తులు వర్షాలతో ఇబ్బంది పడుతున్న వేళ ట్రావెన్ కోర్ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం వసతులను కల్పించి జాగ్రత్తలు తీసుకుంటుంది. మరోవైపు పతనం తిట్ట కలెక్టర్ కూడా వర్షాల నేపధ్యంలో కీలక ఆదేశాలు ఇచ్చారు. వర్షాల కారణంగా ఒకవైపు పంపానదిలో ప్రవాహం కూడా పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రమాదాలను నివారించడానికి చర్యలు చేపట్టారు.


ఎన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక, రాపిడ్ యాక్షన్ టీం, పోలీసు సిబ్బంది వర్షాల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని, భక్తులను ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. శబరిమల కొండల్లో కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలలో నదులు, అడవులు ఉన్న ప్రాంతాలలో భక్తులను అనుమతించరాదని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు పంబానది వద్ద ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా ఘాట్ల వద్ద స్నానానికి దిగకూడదని కూడా సూచనలు చేశారు పతనం తిట్టా కలెక్టర్.


వర్షాలు తగ్గి నది ప్రవాహం తగ్గి సాధారణ స్థితి వచ్చేవరకు ఈ ఆదేశాలు అమలు అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. తీవ్రమైన వర్షాలు పడితే ఒక్కోసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని, కొండ చరియలు విరిగిపడడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, కనుక ప్రమాదకర ప్రాంతాలకు భక్తులు సందర్శకులు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.


వర్షాల కారణంగా నీరు ఎక్కువైనపుడు రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, అందుకే నదులు దాటడాన్ని లేదా స్నానాలు చేయడానికి ప్రయత్నాలు చేయడాన్ని నివారించాలన్నారు. మరోవైపు ఇడుక్కి జిల్లాలో ముక్కు జి సత్రం అటవీ మార్గం గుండా ప్రయాణాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: