ఏంటి.. ఈ రోజు త్వరగా చీకటి పడుతుందా?
సాధారణంగా ఒక రోజు అంటే.. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. శీతాకాలంలో పగలు తక్కువగా, రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. అయితే డిసెంబర్ 21.. అంటే ఇవాళ..సుదీర్ఘమైన రాత్రి సంభవించబోతుందట. ఏకంగా 16 గంటలు రాత్రి సమయం ఉండే వింతను మనం చూడబోతున్నామని ప్రచారం జరుగుతోంది. ఇవాళ పగలు కేవలం 8 గంటలేనంట. గత కొద్ది రోజులుగా ఇదే ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా కూడా లాంగెస్ట్ నైట్ అంటూ ఆసక్తికర కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
ఇలా పగలు సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే పరిస్థితిని వింటర్ సోల్స్టీస్ అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబరు 19 నుంచి 23 మధ్యలో ఏదో ఒక రోజు జరుగుతుంది. వింటర్ సోల్స్టీస్ ఏర్పడే రోజున సూర్యుని నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం ఉంటుంది. ఇక ఈ రోజున భూమి దాని ధృవం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఉష్ణోగ్రతలలోనూ మార్పులు సంభవించి, దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగానే.. ఇవాళ.. అత్యంత తక్కువగా పగలు, సుదీర్ఘమైన రాత్రి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరి నిజంగానే అలా జరుగుతుందా..? శనివారం కొంచెం అటు ఇటుగా ఉదయం 6గంటల 41కి సూర్యోదయం అయింది. మరి సూర్యాస్తమయం ఎప్పుడు..? 16 గంటలు చీకటే ఉంటుందంటే.. మధ్యాహ్నం 2 గంటలకే సూర్యాస్తమయం జరగాలి.
మరి నిజంగానే అలా జరుగుతుందా..? మనం శనివారం సుదీర్ఘమైన రాత్రిని చూస్తామా..? అని జనం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదే సమయంలో కొన్ని అమెరికన్ తెగ మధ్య ఈ వింర్ స్టోల్ స్టీస్ ను సూర్యుడిని తిరిగి తీసుకురావడం అనే ఆచారంగా జరుపుకుంటారని అంఉన్నారు. బోయిన్ వ్యాలీలోని న్యూగ్రాంజ్ వద్ద బోయ్న్ వ్యాలీ గాదరిగ్ అనే వేడుకను ఈ వింటర్ స్టోల్ స్టీస్ సమయంలో జరపుకొంటారు.