హెరాల్డ్ ఎడిటోరియల్: మోడి నుండి జగన్ కు ఊహించని మద్దతు.. ఎల్లోబ్యాచ్ కు షాక్

Vijaya
అమరావతి రాజధాని వివాదంపై చంద్రబాబునాయుడు+ఎల్లోబ్యాచ్ కు కేంద్రం నుండి ఊహించని పెద్ద షాక్ తగిలింది. చంద్రబాబుకు ఎంత పెద్ద షాక్ తగిలిందో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన బూస్టప్ ఇచ్చినట్లే అయ్యింది. విభజన చట్టం ప్రకారం ఏపికి ఒకే రాజధాని ఉండాలని, విభజన చట్టంలో ఏ క్యాపిటిల్ అన్నారే కానీ క్యాపిటల్స్ అని ఎక్కడా చెప్పలేదని చంద్రబాబు అండ్ కో వాదిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ఏర్పాటయ్యింది కాబట్టి అమరావతే రాజధాని అంటూ ఎల్లోబ్యాచ్ మొత్తం కొద్ది రోజులుగా అడ్డుగోలు వాదన వినిపిస్తున్నారు.  ఇదే వాదనతో చాలామంది జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు కూడా వేశారు. అయితే చంద్రబాబు+ఎల్లోబ్యాచ్ మొత్తానికి తాజాగా కేంద్రప్రభుత్వం హై కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పెద్ద షాక్ ఇచ్చిందనే  చెప్పాలి.




కేంద్రం దాఖలు చేసిన తన అఫిడవిట్ లో ఏపికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని స్పష్టంగా చెప్పింది. విభజన చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం ఏ క్యాపిటల్ అనేది లేదని ఏపికి ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చని చెప్పేసింది. అలాగే హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతే రాజధానిగా ఉండాలని కూడా విభజన చట్టంలో ఎక్కడా లేదని సూటిగా, స్పష్టంగా చెప్పేసింది. సరే గతంలో చెప్పినట్లుగానే తాజా అఫిడవిట్లో కూడా  రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమే అని కూడా గుర్తుచేసింది. రాజధాని అంశంలో కేంద్రం ఎటువంటి జోక్యం చేసుకోదని కూడా క్లారిటి ఇచ్చేసింది. మూడు రాజధానుల అంశం చివరకు ఏమవుతుందో ఎవరు చెప్పలేరు కానీ కేంద్రం మాత్రం జగన్ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఇస్తునే ఉంది.  రాజధానుల విషయం,  రాజధానికి హైకోర్టుకు ముడిపెట్టి చంద్రబాబు+ఎల్లోమీడియా చేస్తున్న అడ్డుగోలు వాదనకు కేంద్రం తన తరపున స్పష్టమైన సమాధానమే ఇచ్చేసింది.




కేంద్రం దాఖలు చేసిన తాజా అఫిడవిట్ తర్వాత ఏ క్యాపిటల్ అని, హైకోర్టు ఉంది కాబట్టి అమరావతే రాజధానిగా ఉండాలనే పిచ్చి వాదన కోర్టులో నిలవదు. రాజధాని వివాదంలో ఇప్పటికే కేంద్రం రెండుసార్లు తన వాదనను అఫిడవిట్ రూపంలో చెప్పేసింది. అయితే ఎవరో ఒకళ్ళు కేసు వేస్తున్నప్పుడల్లా హై కోర్టు నోటీసు ఇస్తోంది. కాబట్టి నోటీసందుకున్న ప్రతిసారి కేంద్రం తన అఫిడవిట్ ను దాఖలు చేయాల్సొస్తోంది.  ఏదేమైనా జగన్ ఊహించని రీతిలో కేంద్రం నుండి సంపూర్ణ మద్దతు అందుతుండటం నిజంగా పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. అమరావతిని రాజధానిగా అప్పట్లో చంద్రబాబు ఎంపిక చేసింది రాజకీయపరమైన నిర్ణయమనే చెప్పాలి. కాబట్టి ఇపుడు జగన్ చేస్తున్నది కూడా అలాంటి పనే అనటంలో సందేహం లేదు. అప్పట్లో తాను అమరావతిని ఎంపిక చేయటానికి చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటున్నాడో ఇపుడు జగన్ కూడా అలానే సమర్ధించుకుంటున్నాడు.




సో ఏదేమైనా మూడు రాజధానుల అంశానికి సంబంధించి తాజాగా కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల కోర్టుకున్న సందేహాలు కూడా తీరిపోతాయనే అధికారపార్టీ నేతలు అనుకుంటున్నారు.  సరే ఏదో విధంగా రాజధాని తరలింపును అడ్డుకునేందుకు చాలామందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ ప్రతిపాదనకు అనేక విధాలుగా అడ్డంకులు సృష్టిస్తు కోర్టుల్లో ఒకరి తర్వాత మరొకరితో కేసులు వేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా కోర్టుల్లోనే ఎదుర్కొంటోంది.  కేంద్రం ఎంత స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేస్తున్నా చంద్రబాబు, ఎల్లోమీడియా మాత్రం విచిత్రంగా కేంద్రాన్ని కూడా తప్పుపడుతున్నారు. వీళ్ళ ఉద్దేశ్యంలో జగన్ ప్రతిపాదనను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించాలని. కానీ చట్టం, రాజ్యాంగం ప్రకారం కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేస్తోంది. దీన్నే చంద్రబాబు+ఎల్లోబ్యాచ్ తట్టుకోలేకపోతోంది. ఇందులో భాగంగానే తాజా అఫిడవిట్ ను కూడా ఎల్లోబ్యాచ్ తప్పుపడుతోంది. సరే కోర్టుల్లో వివాదాలు ఎలాగున్నా కేంద్రం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుండటమే జగన్ కు అతిపెద్ద ఊరట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: