లోకేశ్ పాదయాత్ర.. టీడీపీ తలరాత మారుస్తుందా?
అయితే ఈ పాదయాత్ర కొన్ని చోట్ల విజయవంతం కావడానికి, మరి కొన్ని చోట్ల విఫలం కావడానికి ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న నేతలే కారణం ఎందుకంటే పాదయాత్రలో జనసమీకరణ కీలక అంశం. ఆ జనసమీకరణ చేయకపోతే ఏ మాత్రం లాభం లేదు. పీలేరు దగ్గర మాత్రం ఆయనకు ఘన స్వాగతం కూడా లభించింది. రాజా చనిపోతే అక్కడ లోకేష్ నివాళులు అర్పించారు.
పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో టీడీపీకి పట్టు ఉందని నిరూపించారు. అయితే టీడీపీ పార్టీకి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ కి పునరుజ్జీవనం పోయడానికి చేస్తున్న ప్రయత్నాలు కాస్త ఫలితం కనిపించినట్లుగానే తెలుస్తోంది. టీడీపీకి మళ్లీ కొత్త కళ తీసుకురావడానికి లోకేష్ చేస్తున్న పాదయాత్ర పని కొచ్చేలానే కనబడుతోంది.
కార్యకర్తలు, ప్రజలు మళ్లీ టీడీపీ పార్టీకి అనుకూలంగా మారి ఎలాగైన అధికారంలోకి తీసుకొచ్చేలా లోకేశ్ కృషి చేస్తున్నారు. ఈ పాదయాత్ర ప్రస్తుతం వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడం, అస్సలు జనాలు రారు అని అనుకున్నారు. కానీ చాలా ఎక్కువ మంది రావడంతో యాత్ర సక్సెస్ అయింది. ఈ సక్సెస్ ని చూసి అధికార పార్టీ నేతలు కాస్త ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. లోకేశ్ పాదయాత్ర ఇదే విధంగా విజయవంతంగా కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లే. మొన్నటి వరకు జనసమీకరణకే కష్టపడిన టీడీపీ రోజు రోజుకు పాదయాత్ర పట్ల అనుకూల వైఖరి రావడంతో టీడీపీ శ్రేణులకు అనుకూలించే విషయం అని చెప్పొచ్చు.