ఎమ్మెల్సీ ఎఫెక్ట్.. జగన్ కమాండ్ కోల్పోతారా?
ఆ తర్వాత 2014 సంవత్సరంకు వచ్చేసరికి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న వైఎస్సార్సీపీ కేవలం 67 స్థానాలను మాత్రమే దక్కించుకుంటే, తెలుగుదేశం పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. ఆ తర్వాత చూస్తే అందులో 23 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారు. దాన్ని తట్టుకొని తిరిగి 2019లో 151 స్థానాల్లో విజయం సాధిస్తే, ఇదివరకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన్నే టార్గెట్ చేసేవారు. ఆ తర్వాత అధికార పక్షంలోకి వచ్చాక కూడా ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు.
ప్రత్యేకించి రఘురామకృష్ణం రాజు, ఆనం నారాయణ రెడ్డి, కోటం రెడ్డి లాంటివాళ్ళు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా గతం నుండి ఎన్ని ప్రతిఘటనలు వచ్చినా గెలుచుకుంటూ ముందుకు వచ్చిన వైఎస్ఆర్సిపి కి ఇప్పుడు తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గట్టి దెబ్బ తగిలింది. ఇది ఆ పార్టీ వాళ్ళకి మింగుడు పడని విషయం అయింది.
ఇలాంటి పరిస్థితుల్లో కోటంరెడ్డి లాంటివాళ్ళు, రఘురామకృష్ణ రాజు లాంటి వాళ్ళు, ఆనం నారాయణరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో పెరుగుతారు. నువ్వు ఇలా నడుచుకోవాలి లేకపోతే టిక్కెట్ ఇవ్వను అని అంటే ఇవ్వకపోతే మానెయ్ అనే పొజిషన్ వస్తుంది. పార్టీ మీద నమ్మకం పోయి జగన్ మాటని పట్టించుకునే వాళ్ళు తక్కువ అయిపోతారు. దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.