జగన్ను కలవరపెడుతున్న చంద్రబాబు ఓట్ల లెక్కలు?
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం వైసీపీకి దాదాపు 15 శాతం ఓటింగ్ తగ్గినట్లయింది. బీజేపీ 3 శాతం పెరగ్గా, టీడీపీకి 3 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. పీడీఎప్ 13 శాతం పెరిగినట్లయింది. ఉత్తరాంద్రలో టీడీపీకి 43 శాతం పైగా ఓట్లు వస్తే వైసీపీ మాత్రం 29 శాతానికే పరిమితమైంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చూస్తే టీడీపీ 45.3 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయి. కడప, అనంతపూర్, కర్నూలులో మాత్రం టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువగా ఓట్లు వచ్చాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించినవి ఉంటాయి. కాబట్టి ఈ ఓట్లను ప్రాధాన్యంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారు. ఎవరు ఓడతారు అని అంచనా వేయలేం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కానీ కచ్చితంగా వైసీపీ, టీడీపీ రెండు పార్టీల మధ్య పోటాపోటీ ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు, అందరూ కలిసి వైసీపీని ఓడించాలని పట్టుదలతో ఉన్నట్లే కనిపిస్తున్నారు. అన్ని పార్టీలను వైసీపీ ఓంటరిగా ఎదుర్కొవాల్సి వస్తే ఎలాంటి వ్యుహారచనతో ముందుకు సాగుతుందనేది, జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇంకా తెలియడం లేదు.