హెరాల్డ్ ఎడిటోరియల్ : అయ్యో...! ఈ రాజకీయాలు ఇలా తయారయ్యాయేంటి ?

ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే కంపరం పుడుతోంది. అసలు రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అనే పరిస్థితి తలెత్తుతోంది. రాజకీయాలందు తెలుగు రాజకీయాలు వేరయా అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. అసలు రాజకీయాలు ఎలా ఉండకూడదో ఖచ్చితంగా అలానే ఉంటున్నాయి ఏపీలో. రాజకీయంగా ఒకరు పైచేయి సాదిస్తుంటే మరొకరు కిందికి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తప్ప అంతిమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే ఏపీ రాజకీయాలు ఉండడంలేదు. ఒకరు చేసే మంచి పనిని మరొకరు ప్రశంసించడం మానేసి, ఒకరిపై ఒకరు బురద జల్లుకునే విధంగానే నాయకులు ఎక్కువగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీని ఉదాహరణ చూసుకుంటే, ఆ పార్టీ అధినేత తో పాటు ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులంతా అధికార పార్టీపై తరచుగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

 


 ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ, వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం కరోనా  కష్ట కాలంలోనూ ఇదే విధమైన రాజకీయాలకు తెర తీయడం, ప్రభుత్వం అందిస్తున్న సహాయంపైన కూడా విమర్శలు చేస్తూ జాతీయ స్థాయిలో ఏపీ పరువును మంట కలుపుతున్నారు. దీనికి టీడీపీ అనుకూల మీడియా కూడా భాగం అవుతూ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే ఈ విధమైన ఏడుపులు, పెడబొబ్బలు మొదలయ్యాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.


 ప్రతిపక్షంలో ఉండగా చేపట్టిన పాదయాత్ర సమయంలో జగన్ ప్రజల కష్టాలను స్వయంగా చూసి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేశారు. దీంతో జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమోగింది. అయితే దీనిపైన టిడిపి, జనసేన వంటి పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అంతేకాకుండా జగన్ ప్రజలకు మేలు చేసే విధంగా తీసుకున్న నిర్ణయాలపైన కోర్టులో పిటిషన్ లు వేస్తూ అభాసుపాలు చేసేందుకు ప్రయత్నాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉంది. ప్రస్తుతం కరోనా సమయంలో అన్ని రాష్ట్రాలు పార్టీలకు అతీతంగా ఒక్కటే ప్రజలకు మేలు చేసే విధంగా ప్రయత్నిస్తుండగా, ఏపీలో మాత్రం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఈ విధంగా టిడిపి, ఆ పార్టీకి అనుకూల మీడియా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తోంది.

 


 అంతేకాదు ఈ సమయంలో ప్రజలకు భరోసా కల్పించే విధంగా ధైర్యం నింపాల్సిన ప్రధాన ప్రతిపక్షం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండటం ఆ పార్టీపైనా, రాజకీయాలపైన ఉన్న కాస్త గౌరవం కూడా ప్రజలకు పోతుంది. ఇదే విధంగా ముందు ముందు కూడా టిడిపి రాజకీయాలు ఉంటే ఆ పార్టీపై ప్రజల్లో అసహనం మరింత పెరిగిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: