జూ. ఎన్టీఆర్ మౌనం..కారణం అదేనట..?

Sunil Medarametla

తమ అభిమాన నటులను ఎవరన్నా ఏమన్నా అంటే ఆ అభిమానులు ఎంతలా రెచ్చిపోతారో ఇప్పటికే చాలా సార్లు చూశాం. ఆఖరికి తమ హీరోలు వేరే ఏ హీరో కన్న తక్కువ కాదు అని నిరూపిస్తుంటారు కొందరు అభిమానులు. అది ఏ విషయమైన సరే..సోషల్ మీడియా ఫాలోయర్స్ నుంచి అటు ట్రెండింగ్ వరకు, ఇటు సినిమా కలెక్షన్ల వరకు అన్నిట్లో తమ హీరోలను అగ్రస్థానంలో నిలబెట్టాలని చూస్తుంటారు అభిమానులు. మరి అలాంటి హీరోని ఎవరన్నా ఏమన్నా అంటే అభిమానులు ఊరుకుంటారా..? అచ్చం ఇదే జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషయంలో జరిగింది. ఇటీవల ఆన్‌లైన్ వేదికపై చిట్‌చాట్ చేసిన మీరాను ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పమని ఓ అభిమాని అడగగా.. ‘‘ఆయనెవరో నాకు తెలీదు. నేను ఆయన అభిమానిని కాదు’’ అని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై ధ్వజమెత్తడంతో వివాదం మొదలైంది. అలాగే ఆమెను అసభ్యకర పదజాలంతో తిడుతూ.. ట్విట్టర్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వీటిని భరించలేకపోయిన మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేస్తూ..సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. అయితే ఈమె ట్వీట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు సూచించారు. అలాగే  మీరా చోప్రా కి వ్యతిరేఖంగా ఎన్టీఆర్ అభిమానులకు తమిళ నటి ఖుష్బూ మద్దతు పలికారు…

అయితే తాజాగా ఈ వివాదం లోకి పూనమ్‌ కౌర్‌ ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. ఏ హీరో కూడా తన అభిమానులు ఇతరులను ఇబ్బంది పెట్టాలని కోరుకోడని, ఫ్యాన్స్‌ను నిందించడంలో అర్థం లేదని, వాళ్ళు నిజంగా చాలా అమాయకులని పేర్కొంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆ వెంటనే మరో ట్వీట్ చేస్తూ ఈ ఫ్యాన్స్‌ అకౌంట్స్‌ రాజకీయ కారణాలతో కొంతమంది క్రియేట్ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేసింది. ట్రోల్స్ ఎవరు చేసినా చివరకు బ్లేమ్‌ అయ్యేది నటీనటులే అని తెలిపింది. అయితే ఇంతజరుగుతున్నా ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించట్లేదు. అభిమానులే తన బలం, వారికి సదా రుణపడి ఉంటా అంటూ ఎప్పుడు చెప్పే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా మౌనం గా ఉండడం చూస్తే మాత్రం.. ఎందుకు ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడనిపిస్తుంది. మరోపక్క మీరా చోప్రా ఎన్టీఆర్ ని టాగ్ చేస్తూ ఎన్టీఆర్ స్పందించాలని, అభిమానులను కంట్రోల్ లో పెట్టుకోవాలంటూ ట్వీట్ చేసింది. అయినా ఎన్టీఆర్ సైలెన్స్ నే మైంటైన్ చేస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ తన అభిమానుల విషయంలో మనస్తాపానికి లోనయ్యాడని.. ఇంత హాట్ గా ఉన్న టైం లో ఎన్టీఆర్ చెప్పినా అభిమానులు వినరనే ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నాడని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: