మాది ఫెవికాల్ బంధం అని చెప్పేశారు గా ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, జగన్ తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2 ఎవరంటే టక్కున చెప్పే సమాధానం విజయసాయిరెడ్డి పేరు. పార్టీలోను, ప్రభుత్వంలో అయినా, ఏ విషయంలో అయినా, విజయసాయిరెడ్డి ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది. జగన్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలను అన్నిటినీ జగన్ చక్కబెడుతూ, ఎప్పుడు ఏం చేయాలి ? ఎవరెవరు జగన్ ని కలిసేందుకు అనుమతివ్వాలి ? వారు ఏం మాట్లాడుతున్నారు ? ఎవరిని ఏవిధంగా దారిలోకి తీసుకురావాలి ? చేరికలు, సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు ఇలా అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి చక్కబెడుతూ వస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ విశాఖ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తోంది. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఎక్కువగా విశాఖలోని మకాం వేసి అక్కడ పట్టు  పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. 


ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో విశాఖ ను రాజధానిగా ఎంపిక చేయడంతో విశాఖ ప్రాధాన్యం మరింత పెరిగింది. అలాగే విజయసాయిరెడ్డి విశాఖ పై అంతగా దృష్టి పెట్టడానికి కారణం ఏంటి అనే విషయం కూడా అందరికీ అర్థమైపోయింది. దీంతో కొంతమంది విశాఖ నేతలు విజయసాయిరెడ్డికి పొగ పెట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారట. విజయసాయిరెడ్డి పని అయిపోయిందని, జగన్ ఆయనను పక్కన పెట్టేసాడ ని, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా విజయసాయిరెడ్డికి చెక్ పెడుతున్నారని, ఇలా పెద్ద ఎత్తున కథనాలు మీడియాలో రావడం, ఆ విధంగానే జగన్ వ్యవహరిస్తున్నట్టుగా కనిపించడం వంటివి జరిగాయి. కానీ జగన్ మాత్రం విజయసాయి రెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు మొత్తం అప్పగించడంతో ఒక్కసారిగా అందరి నోళ్ళు మూతపడ్డాయి.


విశాఖలో వేల కోట్లు విలువ చేసే భూములను పొందడంతో వాటిపై రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల నాయకుల కళ్లు పడ్డాయి. అలాగే భూకబ్జాలకు పాల్పడడం,  ప్రతి దశలోనూ విజయసాయిరెడ్డి అడ్డుకోవడం వంటివి వారికి ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ విజయసాయిరెడ్డి పై చెడు అభిప్రాయం కలిగే విధంగా, కొంతమంది నేతలు కొన్ని రకాల ఎత్తుగడలు వేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు ఎన్నో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను చేయించారు. దీంతో జగన్ ఆయన్ను పక్కన పెట్టేస్తున్నారు అనే ప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టారు. కానీ అనూహ్యంగా జగన్ ఉత్తరాంధ్ర బాధ్యతలు మొత్తం విజయసాయిరెడ్డి కి అప్పగించడంతో ఖంగుతిన్న సదరు నేతలంతా, ఇపుడు మళ్లీ విజయసాయిరెడ్డి భజనతో హడావుడి చేస్తున్నారు. 

 

 

విజయసాయిరెడ్డి కి వైసీపీలో ప్రాధాన్యత  తగ్గిపోతుందని అనుకుంటున్న సమయంలో ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు మొత్తం ఆయన చేతుల్లో పెట్టడంతో, ఒక్కసారిగా ఈ ఊహించని పరిణామాలకి విజయసాయిరెడ్డి వ్యతిరేక శక్తులు షాక్ అయ్యాయి. తాను ఎవరు ఏం చెప్పినా వినని, తాను నమ్మిన వారికి ఎప్పుడు న్యాయం చేస్తానని, ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదనే  ఆ విషయాన్ని ఇప్పుడు విజయసాయిరెడ్డికి విషయంలో జగన్ నిరూపించారు.  సీనియర్లు, జూనియర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఎవరైనా విజయసాయిరెడ్డి చెప్పినట్టు చేయాలనే  సంకేతాలు జగన్ ఇవ్వడంతో ఇప్పుడు మరోసారి ఆయన ప్రాధాన్యత మరింత పెరిగినట్టుగా ఆయన వ్యతిరేకుల చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: