హెరాల్డ్ ఎడిటోరియల్ :   ప్రభుత్వం నుండి చంద్రబాబుకు ఊహించని దెబ్బ.. మామూలు దెబ్బ కాదు

Vijaya

కొడితే ఏనుగు కుంభస్ధలాన్నే కొట్టాలి అనేది తెలుగులో బాగా పాపులరైన నానుడి. చంద్రబాబునాయుడు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. తాజాగా ’అముల్’ తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఎక్కడో గుజరాత్ కేంద్రస్ధానంగా  ఉన్న అమూల్ కు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో  ఔట్ లెట్లు, స్టోర్లు, సరఫరాదారులున్నారు. అంటే పటిష్టమైన మార్కెట్ నెట్ వర్క్ ఉన్న సంస్ధ అని తెలిసిపోతోంది. ఇంత పటిష్టమైన అముల్ సంస్ధతో రాష్ట్రప్రభుత్వం వ్యాపారపరమైన అవగాహనా ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామాలతో రాష్ట్రంలోని డైరీ వ్యాపారాలు చేస్తున్న ప్రతీ సంస్ధ మీద ప్రభావం పడకతప్పదన్నది అర్ధమైపోయింది. మిగిలిన సంస్ధల విషయాన్ని పక్కనపెట్టేసినా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ సంస్ధ మీద మాత్రం తీవ్ర ప్రభావం చూపటం ఖాయమనే అనుకోవాలి.

హెరిటేజ్ సంస్ధ దాదాపు 25 ఏళ్ళుగా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా బలపడిపోయింది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా హెరిటేజ్ సంస్ధల షేర్లు రాకెట్ వేగంతో ఆకాశంలోకి ఎగబాకుతుంటుందని వైసిపి నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లే టిడిపి అధికారంలో ఉన్నంత వరకు హెరిటేజ్ షేర్ల ధరలు బాగా పెరుగుతుంటాయి. ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చేస్తుందో మెల్లిగా షేర్ తగ్గిపోతుందట. ఈ కారణంగానే వైసిపి నేతలు హెరిటేజ్ వ్యాపారానికి చంద్రబాబుకు అధికారానికి ముడేసి ఆరోపణలు చేస్తుంటారు.  నిజానికి హెరిటేజ్ కన్నా ముందు తర్వాత డైరీ రంగంలోకి చాలా కంపెనీలే వచ్చినా దాదాపు అన్నీ దెబ్బ తినేశాయి. లేదా హెరిటేజ్ లో కనిపించినంత బిజినెస్  పెరుగుదల మిగిలిన వాటిల్లో కనబడలేదన్నది వాస్తవం.

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే ఏడాది క్రిందట అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బ తీస్తున్నట్లుగా చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళ ఆరోపణల్లో నిజాలెంత అన్నది పక్కన పెట్టేస్తే ఇపుడు నేరుగా చంద్రబాబుకే ప్రభుత్వ పరంగా సవాలు ఎదురురైంది. డైరీ వ్యాపార రంగంలో హెరిటేజ్ చాలా పెద్ద సంస్ధగా అనుకుంటే అంతకమించి ఎన్నోరెట్లు పెద్దది అమూల్ కంపెనీ. ఆసియా ఖండంలోనే పెద్ద సంస్ధగా అముల్ కు పేరుంది. పోయిన ఏడాది అముల్ టర్నోవర్ రూ. 52 వేలకోట్లంటేనే దాని కెపాసిటి ఏమిటో అర్ధమైపోతోంది.

హెరిటేజ్ ప్రైవేటు రంగంలోని సంస్ధ అయితే అముల్ సహకార రంగంలోని సంస్ధ. హెరిటేజ్ వ్యాపార విస్తరణకు తీసుకున్న ప్రతి చర్య సొంతంగానే తీసుకోవాలి. పాల ఉత్పత్తిదారులతో ఒప్పందాలు, సరఫరా, పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ తదితరాలన్నింటినీ సొంతంగానే చూసుకోవాలి. అదే అముల్ విషయానికి వస్తే ప్రతి అడుగులోను ప్రభుత్వ మద్దతుంటుంది. ఏపిలో రోజుకు 4 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తవుతోంది. ఇపుడున్న డైరీలకన్నింటికీ  కలిపి 2 కోట్ల లీటర్ల పాలు సరఫరా అవుతున్నా మిగిలిన 2 కోట్ల లీటర్ల పాలు ఏమవుతోంది. ఇందులో కొంత రీటైల్ గా అమ్ముడవుతోంది. మరి మిగిలిన కోట్ల లీటర్లు ? ఇపుడా పాలంతా అముల్ కంపెనీకి సరఫరా అవుతాయి. 7 వేల గ్రామాల్లోని మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘలు అమూల్ కు మద్దతుగా నిలబోతున్నాయి. అంటే పాల సేకరణకు పెద్దగా  అమూల్ కష్టపడక్కర్లేదు.

పాల అమ్మకంతో పాటు పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ తదితరాలన్నింటినీ ప్రభుత్వం+ అముల్ కంపెనీలు రెండు కలిసే చూసుకుంటాయి. రాష్ట్రంలోని 11500 రైతు భరోసా కేంద్రాలను అముల్ తో టైఅప్ చేస్తోంది ప్రభుత్వం. మహిళా సంఘాలను కూడా అముల్ తో జత కట్టేందుకు ప్రోత్సహిస్తోంది. అముల్ లాంటి కంపెనీకి ప్రభుత్వం మద్దతుంటే ఇక చెప్పాల్సిన పనేముంది ? వ్యాపారంలో ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకుపోవటం ఖాయం. ఒకసారి అముల్ వ్యాపారం మొదలైందంటే ఇప్పటికప్పిడు కాకపోయినా నాలుగేళ్ళల్లో దాదాపు అన్నీ డైరీలకు హెరిటేజ్ తో కలుపుకుని దెబ్బ తినేయటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతోంది. అదే జరిగితే చంద్రబాబు కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ దెబ్బతినటం తప్పదు. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: