షాకింగ్: సుశాంత్ చనిపోయే ముందు నెట్లో దేని గురించి వెతికాడో తెలుసా...?
ఈ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సుశాంత్ చనిపోయే ముందురోజు ఏం చేశాడన్నది వెలుగు చూసింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. సుశాంత్ చనిపోవడానికి ఐదు రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా షాలిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో సుశాంత్‌కు సంబంధం ఉన్నట్లు పలు వార్తలు వెలువడ్డాయి. దీంతో సుశాంత్ బాగా మనస్థాపానికి గురయ్యాడు.
ఆయన ఎంత డిప్రెషన్ లోకి వెళ్లాడంటే.. సుశాంత్ చనిపోవడానికి రెండు గంటల ముందు వరకూ కూడా తన పేరు మీద గూగుల్‌లో వెతికాడట. దిశ ఆత్మహత్య ఘటనపై ఎలాంటి వార్తలు వచ్చాయి? ఏయే వార్తల్లో తన పేరుంది? తదితర విషయాల గురించి అతను వెతికినట్టు తెలిసింది. దానికి సంబంధించిన వార్తలన్నీ చదివాడట. ఆ తర్వాతే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆ తర్వాత సుశాంత్.. నొప్పిలేకుండా చనిపోవడం ఎలా? అనే అంశం గురించి గూగుల్ లో వెతికాడట.
సుశాంత్ చనిపోవడానికి ఆరు రోజుల ముందు అతడి ఇంటి నుంచి స్నేహితురాలు రియా చక్రవర్తి వెళ్లిపోయిన ఘటనపైనా పోలీసులు వివరణ ఇస్తున్నారు. జూన్ 8న సుశాంత్ ఇంటి నుంచి రియా చక్రవర్తి వెళ్లిపోయింది. అప్పుడు ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆ తర్వాత సుశాంత్ సోదరి ఆయన ఇంటికి వచ్చారు. జూన్ 13వ తేదీ వరకూ ఆమె అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఆమె కుమార్తెకు పరీక్షలు ఉండటంతో వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని సుశాంత్ సోదరి తన వాంగ్మూలంలో తెలిపారు అంటూ విచారణ అధికారి సంజయ్ మీడియాకు తెలిపారు.