హెరాల్డ్ ఎడిటోరియల్ : అఫిడవిట్ తో చంద్రబాబు, ఎల్లోమీడియాకు షాకిచ్చిన జగన్
ఇంతకీ అఫిడవిట్లో ఏముందంటే అసలు రాష్ట్ర విభజన చట్టమే అమల్లో లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపికి ప్రత్యేకహోదా రావాలి. హోదాను తుంగలోతొక్కడం ద్వారా కేంద్రమే రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లు రాష్ట్రప్రభుత్వం తన అఫిడవిట్లో స్పష్టంగా చెప్పింది. దీన్ని కాదనేందుకు ఎవరికీ అవకాశం లేదు. ఇక మిగిలిన విషయాలను చూస్తే వైజాగ్ కు ప్రత్యేక రైల్వేజోన్ కేటాయించింది రాష్ట్ర విభజన చట్టం. మరి వైజాగ్ కు ప్రత్యేక రైల్వే చట్టం కేంద్రం ఇవ్వలేదు కదా, ఏమైంది ? అంటే ఇక్కడ కూడా విభజన చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించినట్లే అయ్యింది. ఇక పోలవరం ప్రాజెక్టు విషయాన్ని చూద్దాం. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా దక్కింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన పరిధిలోకి ఎలా తీసుకున్నాడు ? అంటే ఇక్కడ చంద్రబాబు కూడా చట్టాన్ని ఉల్లంఘించినట్లే.
రాష్ట్ర విభజన చట్టంలో చంద్రబాబు ఉల్లంఘించిన మిగిలిన అంశాలు చూద్దాం. చట్ట ప్రకారం పదేళ్ళు హైదరాబాద్ ఏపి, తెలంగాణాకు ఉమ్మడి రాజధాని. మరి ఎన్నికలు జరిగిన ఏడాదిలోనే ఎవరినడిగి చంద్రబాబు హైదరాబాద్ పై హక్కులను వదులుకుని విజయవాడకు పారిపోయొచ్చాడు ? ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పటమేంటి ? అందుకు చంద్రబాబు తలూపటమేంటి ? రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏపికి రావాల్సిన ప్రత్యేకహోదాను చంద్రబాబు ఎవరినడిగి వదులుకున్నాడు ? హోదా వద్దని చంద్రబాబు చెప్పేముందు రాష్ట్రంలోని మిగిలిన ప్రతిపక్షాల అభిప్రాయాలను, అడిగాడా ? ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని కేంద్రం చెబితే ఏకపక్షంగా చంద్రబాబు ఎలా సమ్మతించాడు ? ప్రతిపక్షాలను కానీ, జనాభిప్రాయాలను కానీ చంద్రబాబు ఎందుకు తీసుకోలేదు ?