హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయా ? ఇదేనా ఆధారం ?
చాలా అంశాలను ఉదహరిస్తు జగన్ పై ఆర్కే విషం చిమ్మినా ఒక విషయంలో మాత్రం తన అంతరంగాన్ని స్పష్టంగా బయటపెట్టేసుకున్నాడు వేమూరి. అదేమిటంటే, అవినీతి కేసుల్లో తనను కేంద్రప్రభుత్వం జైలుకు పంపటం ఖాయమని జగన్ మానసికంగా సిద్ధమైపోయాడట. అందుకనే ప్రత్యామ్నాయంగా తన భార్య భారతిని ముఖ్యమంత్రిని చేయాలని కూడా జగన్ డిసైడ్ చేసేశాడట. బిజెపిలో వైసిపిని విలీనం చేయమని ఇదివరకే అడిగినా జగన్ కుదరదుపొమ్మనాడట. అందుకని సమయం చూసుకుని జగన్ను దెబ్బ కొట్టడానికి బిజెపి రెడీగా ఉందని వేమూరి తేల్చేశాడు. 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్ముతున్న జగన్ భవిష్యత్ బిజెపి చేతిలో ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఒకవేళ కేసులను దృష్టిలో పెట్టుకుని జగన్ భవిష్యత్ బిజెపి చేతిలో ఉందని ఆర్కే అనుకుంటే అదే పద్దతిలో చంద్రబాబు భవిష్యత్ కేసీయార్ చేతిలో ఉందని మరచిపోయినట్లున్నాడు.
ఇక విజయవాడలో స్వర్ణాప్యాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో యాజమాన్యం పోతిన రమేష్ చౌదరిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రమాదాన్ని ప్రమాదంగా మాత్రమే చూడాలని ఆర్కె ప్రభుత్వానికి ఇపుడు చెబుతున్న బుద్దులు వైజాగ్ కు సమీపంలోని ఎల్జీ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాదం జరిగినపుడు ఏమైంది ? అప్పుడు మాత్రం ప్రమాదాన్ని ప్రమాదంగా ఎందుకు చూడలేకపోయాడు వేమూరి. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని, కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టలేదని ఎంత గోల చేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. గ్యాస్ ప్రమాదంలో కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టలేదని, అరెస్టులు చేయలేదని ఎందుకు గొంతులు చించుకున్నది. మరప్పుడు మాత్రం ప్రమాదాన్ని ప్రమాదంగా ఎందుకు చూడలేకపోయింది ? ఎందుకంటే ఎల్జీ కంపెనీ కమ్మ వాళ్ళది కాదు కాబట్టే అని జనాలనుకుంటే వాళ్ళ తప్పుకాదు.
స్వర్ణాప్యాలెస్ కోవిడ్ కేంద్రం నడుపుతున్న యజమాని పోతిన రమేష్ బాబు కమ్మ సామాజికవర్గంలో ప్రముఖుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావటంతోనే ప్రమాదంపై ఎల్లోబ్యాచ్ లో ఎవరూ నోరిప్పటంలేదని అందరికీ అర్ధమైపోయింది. అమరావతిని కొనసాగించుంటే ఈపాటికే హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులన్నీ వచ్చేసేవనే చెత్త లాజిక్ వేమూరికే చెల్లింది. చంద్రబాబు తన ఐదేళ్ళ కాలంలో అమరావతికి ఎందుకు కార్పొరేట్ ఆసుపత్రులను రప్పించలేకపోయాడు ? చంద్రబాబు వైఫల్యాలను కూడా జగన్ ఖాతాలో వేయటానికి చెత్తపలుకులో ఆర్కె తెగ అవస్తలు పడుతున్న విషయం తెలిసిపోతోంది. మొత్తంమీద జగన్ అంటే యావత్ ఎల్లోబ్యాచ్ ఎంత కసితో రగిలిపోతోందో అర్దమైపోయింది. ఇందులో భాగమే ప్రభుత్వానికి న్యాయవ్యవస్ధకు మధ్య అగాధం సృష్టించి జగన్ ప్రభుత్వాన్ని ఏదో చేసేద్దామన్న కుట్ర జరుగుతున్నట్లే జనాలకు అర్ధమవుతోంది.