హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుపై తొందరలోనే ... రెడీ అవుతున్న సంచైత ?

Vijaya
ఒకటే అబద్ధాన్ని పదే పదే చెప్పించినా లేదా ప్రచారం చేసినా జనాలు దాన్నే నిజమనుకుంటారన్నది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు నమ్మకం. ఈ సిద్దాంతాన్నే చంద్రబాబు గడచిన 40 ఏళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్నాడు. కొన్నిసార్లు సక్సెస్ అయినా కొన్నిసార్లు ఫెయిల్ కూడా అయ్యాడు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం మాత్రం మొత్తం కెరీర్ లోనే ఎప్పుడు ఎదురుకాలేదన్నది నిజం.  ప్రతిపక్షంలో  కూర్చున్నా చంద్రబాబు బుద్ధిమాత్రం మారలేదు. తాజాగా మాన్సాస్ ట్రస్టు విషయంలో తన పద్దతిలో పదే పదే దాడులు చేస్తున్నాడు. లేని సమస్యలు ఉన్నట్లుగా చంద్రబాబు ఒకటికి పదిసార్లు చంద్రబాబు, చినబాబు తన మీడియాలో చిత్రీకరించటమే కాకుండా ట్విట్టర్ ద్వారా కూడా దుష్ప్రచారం చేస్తున్నాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు ఎదురుదాడి మొదలుపెట్టింది.


​https://twitter.com/rameshfilms/status/1296711860629078017?s=20​​​

ట్రస్టు పరిస్దితిపై సంచైత ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరణలు ఇస్తున్నా చంద్రబాబు మాత్రం ఆమెను పట్టించుకోకుండా ట్రస్టుపై బురద చల్లేస్తునే ఉన్నాడు. మాన్సాస్ ట్రస్టులో పనిచేసే 879 ఉద్యోగుల కుటుంబాలు రోడ్డెక్కినట్లు చంద్రబాబు ట్వీటారు.  ట్రస్టు ఉద్యోగులకు ఇటువంటి దుస్ధితి ఎదురుకాకూడదనే వ్యవస్ధాపక ఛైర్మన్ పివిజి రాజు వేలాది ఎకరాలు, వందల కోట్ల నగదును ట్రస్టు పేరుతో పెట్టినా ఇపుడు ఉద్యోగులకు ఎందుకింత దురవస్ధ పట్టిందంటూ అబద్ధపు సానుభూతిని చూపటంతో సంచైత గట్టిగానే తిప్పికొట్టింది. నిజానికి సంచైత ట్రస్టు బోర్డు ఛైర్ పర్సన్ కావటం బాబాయ్ అశోక్ గజపతిరాజుకు ఏమాత్రం ఇష్టంలేదు. దానికి తోడు చంద్రబాబు కూడా బుర్రకు తోచింది ట్విట్టర్లో పెట్టేస్తు ట్రస్టును గబ్బుపట్టిస్తున్నాడు.




నిజానికి మాన్సాస్ ట్రస్టు గబ్బుపట్టిందే చంద్రబాబు హయాంలో. విపరీతమైన రాజకీయజోక్యంతో ట్రస్టు నిధులను భారీగా దారి మళ్ళించినట్లు చాలా ఆరోపణలే ఉన్నాయి. అశోక్+చంద్రబాబు ఏకమైపోవటంతో ట్రస్టు యాజమాన్యం ఇష్టారీతిలో వ్యవహరించింది. ట్రస్టులో తన మద్దతుదారుడైన కుటుంబరావులాంటి వాళ్ళని ట్రస్టులో సభ్యులుగా నియమించి చంద్రబాబే వెనకనుండి షో రన్ చేశాడు. పేరులో మాత్రం రాజు అని ఉన్నా అశోక్ నిజానికి ఏరోజు అలా వ్యవహరించలేదు. అందుకనే సొంత ప్రభుత్వంలోనే  ట్రస్టు ఆర్ధిక పరిస్ధితి దిగజారిపోతున్నా, వ్యవహారాలు  భ్రష్టుపుతున్న పట్టించుకోలేదు. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాతే ట్రస్టును చంద్రబాబు+అశోక్ కలిసి ఎంతగా నాశనం చేశారో అందరికీ తెలిసివస్తోంది.




చంద్రబాబు, అశోక్ ఆరోపిస్తున్నట్లు సంచైత పగ్గాలు చేపట్టిన తర్వాతే ఆర్ధిక పరిస్ధితి దిగజారలేదు. ఎలాగంటే సంచైత ట్రస్టు పగ్గాలు తీసుకున్నది మొన్నటి మార్చినెలలో మాత్రమే. అప్పటి వరకు అశోక్ గజపతిరాజే ట్రస్టుకు ఛైర్మన్ అన్న విషయం తెలిసిందే.  అంటే దాదాపు 15 ఏళ్ళపాటు అశోకే ట్రస్టు ఛైర్మన్ గా ఉన్నాడు. సంచైత ట్రస్టు పగ్గాలు అందుకోగానే కరోన వైరస్ సమస్య వచ్చేసింది. కాబట్టి బాధ్యతలు తీసుకున్నా పూర్తిస్ధాయిలో  పనిచేసింది లేదనే చెప్పాలి. ఇంతోటి దానికి సంచైత ఏ విధంగా ట్రస్టు ఆర్ధికపరిస్ధితిని దిగజార్చేసింది ? పైగా 2016 నుండి ప్రభుత్వం ట్రస్టుకు ఇవ్వాల్సిన రూ. 20 కోట్లు ఇవ్వలేదని సంచైత చేసిన ఆరోపణకు చంద్రబాబు అసలు నోరెత్తలేదు.




అంటే సంచైత ఏమి చెప్పినా, వాస్తవాలు ఏమిటనేదానితో సంబంధాలు లేకుండా తాను మాత్రం పదే పదే బురద చల్లేయాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లే ఉన్నాడు. అందుకనే ట్రస్టుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని సంచైత హెచ్చరించింది. క్షమాపణలు చెప్పకపోతే చంద్రబాబుపై లీగల్ గా ప్రొసీడ్ అవుతానని చేసిన హెచ్చరిక సంచలనం మొదలైంది. నిజానికి రాజకీయాల్లో పిల్ల కాకి లాంటి సంచైతతో కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బుద్ధులు చెప్పించుకోవాల్సి రావటమే అవమానం. కానీ చంద్రబాబుకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉన్నట్లు లేదు.



ఎవరినైనా సరే గోకటం తర్వాత వాళ్ళతో రక్తం వచ్చేట్లు గోకిచ్చుకోవటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయినట్లే ఉంది. చూడబోతే ట్రస్టు ఛైర్మన్ చంద్రబాబును  కోర్టుకీడ్చేట్లే  ఉంది. ట్రస్టు వ్యవహారాలంటే ఏదో రాజకీయ ఆరోపణల్లాగ గాలి వ్యవహారం కాదని చంద్రబాబుకు అంతమాత్రం తెలీదా ? లెక్కలు, బొక్కలు చాలానే ఉంటాయి. అవన్నీ కోర్టులో పెడితే చంద్రబాబు పని గోవిందా . చూద్దాం ఛైర్మనమ్మ చంద్రబాబును ఏమి చేస్తుందో ?







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: