హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాలపై జగన్ మాస్టర్ స్ట్రోక్.. దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఫ్లాట్

Vijaya
రాజకీయమంటే ఇలాగే ఉండాలి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తు ప్రత్యర్ధులను కట్టిపడేసేట్లుండాలి. ఇపుడు జగన్మోహన్ రెడ్డి చేసిందదె. ఊహించని రీతిలో జగన్ వేసిన పై ఎత్తుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కసారిగా చిత్తయిపోయాయి. ఇంతకీ విషయం ఏమిటంటే అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఆలయం ఉందికదా. దానికి సంబంధించిన రథం నాలుగు రోజుల క్రిందట అగ్నికి ఆహుతయ్యింది. ఆ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించేందుకు జగన్ నిర్ణయించటాన్ని ప్రతిపక్షాలు ఏమాత్రం ఊహించలేదని చెబుతున్నారు. విచారణను సిబిఐకి అప్పగించటంతో ఏమి చేయాలో తెలీక ప్రతిపక్షాల నేతల నోళ్ళని మూతపడిపోయాయి.




రథం తగలబడటానికి బాధ్యులెవరో ఎవరికీ తెలీదు. అసలు ఎందుకు తగలబెట్టారో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం పోలీసులతో విచారణ చేయిద్దామని అనుకున్నది. దాన్ని అవకాశంగా తీసుకుని బిజెపి+జనసేనతో పాటు టిడిపి కూడా నానా యాగీ మొదలుపెట్టింది. రథం తగలబడటంలో ప్రభుత్వందే బాధ్యతంటూ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు రెచ్చిపోతున్నాడు. ఇక చంద్రబాబునాయుడు గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. జగన్ సిఎం అయిన తర్వాతే హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని, దేవాలయాల్లో అపచారాలు జరిగిపోతున్నట్లు గోల చేసేస్తున్నాడు. తన హయాంలో 36 దేవాలయాలను కూల్చేసిన ఘటనను చంద్రబాబు కన్వీనియంట్ గా మరచిపోయాడు. తిరుమలకు వెళ్ళే బస్సుల టిక్కెట్ల వెనుక ఇజ్రాయెల్, మక్కా మశీదు యాత్రల గురించి టిడిపి ప్రభుత్వం చేసుకున్న ప్రచారం గురించి కూడా చంద్రబాబు నోరిప్పటం లేదు.




ఇంతమంది మాట్లాడుతున్నపుడు పవన్ మాత్రం ఎందుకూరుకుంటాడు. రథం తగలబడిన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఏకంగా దీక్షే చేయబోతున్నట్లు ప్రకటించేశాడు. జరిగిన ఘటన నుండి రాజకీయ లబ్దిపొందాలని ప్రతిపక్షాలు చేయని ప్రయత్నాలు లేవు. అధికారపార్టీ నరసాపురం ఎంపి రఘుకృష్ణంరాజు అయితే ఘటన వెనుక మతపరమైన కుట్రుందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడేశాడు. జగన్ మీద తనకున్న కసినంతా ఎంపి+ఎల్లోమీడియాలు తీర్చేసుకుంటున్నాయి. అంటే ఒకరకంగా జగన్ ను హిందువులకు దూరం చేసేందుకు ప్రయత్నాలను చాలా పెద్ద ఎత్తున మొదలుపెట్టేశాయి. ఎలాగూ తగలబడింది దేవుడి రథం కాబట్టి భక్తుల్లో కూడా సెంటిమెంటు ఉంటుంది. దాన్నే క్యాష్ చేసుకుందామని ప్రతిపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.





ఈ విషయాలను గ్రహించిన జగన్ వెంటనే  ఘటనపై విచారణ జరిపే బాధ్యతను సిబిఐకి అప్పగించేశాడు. నిజంగా రాష్ట్రపరిధిలోని పోలీసులు నిజాయితీగా విచారణ జరిపినా ప్రతిపక్షాలు ఒప్పుకునేట్లుగా లేవనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే సిబిఐ విచారణలో వాస్తవాలు బయటకు వస్తే ప్రతిపక్షాలకు ఏమీ మాట్లాడలేవు. ఎందుకంటే సిబిఐ అంటే కేంద్రప్రభుత్వ సంస్ధ కాబట్టి బిజెపి నోరెత్తదు. ఇదే సమయంలో మోడి, అమిత్ షా దృష్టిలో పడాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు కూడానట్లు   కూడా తోడవ్వటంతో ర్టీ తుడిచిపెట్టుకుపోయింది.దు. రం. వ్యతిర నోరెత్తడు. సరే జనసేనానికి మాట్లాడే అవకాశమే లేదు. కాబట్టే జగన్ ఎత్తుకు ప్రతిపక్షాలన్నీ చిత్తయిపోయినట్లే అనుకోవాలి. ఇదే విషయమై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా జగన్ను అభినందించటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: