హెరాల్డ్ ఎడిటోరియల్ : టైమింగ్ అంటే జగన్ దే...దిమ్మతిరిగిపోయిందా ?

Vijaya
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అనే పాటొకటుంది. అచ్చం అదే పాట తరహాలో జగన్మోహన్ రెడ్డి కొట్టిన బాల్ నేరుగా సిక్స్ కి వెళ్ళిపోయినట్లుంది. ఇదంతా దేనికంటే గడచిన రెండు రోజులుగా ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై హైకోర్టు స్పందించిన తీరు ఇపుడు జాతీయస్ధాయిలో తీవ్ర వివాదాస్పదమైపోయింది. మామలూలుగా అయితే హైకోర్టు తీరుపై ఇంతటి చర్చ జరిగుండేది కాదేమో. కానీ జగన్ వ్యూహం సక్సెస్ అవటంతో ఇపుడు జాతీయస్ధాయిల్ రచ్చ మొదలైపోయింది. ఇంతకీ జగన్ చేసిందేమిటయ్యా అంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు ఏసిబిని రంగంలోకి దింపి ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదయ్యేట్లు చేయటం. దీన్నే టైమింగ్ అంటారు.




ఏసిబి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 13 మంది పేర్లున్నాయి. అందులో ఇద్దరు అమ్మాయిల పేర్లు కూడా ఉన్నాయి.  పేర్లున్నాయే కానీ వాళ్ళ ఐడెంటి ఏమీలేదు.  ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్లో దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఎఫ్ఐఆర్ నమోదవ్వటంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దమ్మాలపాటి విచారణ వరకే హైకోర్టు  తీర్పిచ్చుంటే సరిపోయేది. ఏసిబి విచారణ జరిపేందుకు లేదని, చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపించేందుకు లేదన్నది. పైగా సిబిఐ విచారణ జరిపించాలంటు దాఖలైన పిటీషన్ను కొట్టేపింది. చివరగా ఏసిబి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్  పై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎక్కడా కవరేజి ఇవ్వకుండా బ్యాన్ పెట్టింది.




ఈ మొత్తం పాయింట్లలో ఏసిబి విచారణ జరిపేందుకు లేదని చెప్పటంతో పాటు ఎఫ్ఐఆర్ పై ఎక్కడ వార్తలు, కథనాలు, చర్చలు జరక్కూడదని చెప్పటమే ఇపుడు హైకోర్టును ఆత్మరక్షణలోకి పడేసింది. మీడియాపై ఎక్కడైనా ప్రభుత్వాలు బ్యాన్ పెడతే కోర్టులు మీడియాకు రక్షణగా నిలుస్తుంది. కానీ ఇక్కడ కోర్టే మీడియాపై బ్యాన్ పెట్టడమన్నది అసాధారణం. ఎప్పుడైతే కోర్టు తీర్పు మంగళవారం రాత్రి బయటకు వచ్చిందో వెంటనే విషయం బుధవారం ఉదయానికి దేశమంతా పాకిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంగళవారం రాత్రి మీడియాపై కోర్టు బ్యాన్ పెట్టేసమయానికే ఏసిబి ఎఫ్ఐఆర్ కాపీలు సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారంలోకి వచ్చేసింది. దాంతో ఎఫ్ఐఆర్ కాపీలు జాతీయ మీడియా చేతిలో పడ్డాయి.




ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కాపీలు జాతీయ మీడియాకు చిక్కిందో దేశంలోని కొందరు ప్రముఖ పాత్రికేయులు, ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ హైకోర్టును గట్టిగా తగులుకున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో మాజీ అడ్వకేట్ జనరల్ భాగస్వామైతే ఆయన విచారణను మీడియా కవర్ చేయకూడదదా ? అంటూ నిలదీశారు. పనిలో పనిగా సుప్రింకోర్టు జస్టిస్  ఎన్వీ రమణ పిల్లలకు కూడా ట్రేడింగ్ లో భాగస్వాములైన కారణంగానే మీడియాపై హైకోర్టు బ్యాన్ పెట్టిందంటూ మండిపోయారు. బహుశా హైకోర్టు తీర్పుపై జాతీయస్ధాయిలో మీడియా ప్రముఖులు ఇంతగా రెచ్చిపోతారని ఊహించలేదేమో.



నిజానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబి నమోదు చేసిన 13మందిలోని ఇద్దరమ్మాయిలు  ఎన్వీ రమణ కూతర్లని చాలామందికి తెలీదు. కానీ కొందరు మీడియా ప్రముఖులు ఏకంగా ఎన్వీ రమణ పేరుని డైరెక్టుగా  ప్రస్తావించటంతో  విషయం అంతా రచ్చ రచ్చగా తయారైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంపైన కూడా టిడిపి కోర్టుకెళుతుందని జగన్ కు బాగా తెలుసు. కోర్టు ఎలా స్పందిస్తుందో కూడా ఊహించిందే. కానీ ఏసిబి ఎఫ్ఐఆర్ లోని పేర్లపై  జాతీయస్ధాయిలో చర్చ జరగాలని, రచ్చ అవ్వాలని జగన్ కోరుకున్నాడు. చివరకు పార్లమెంటు సమావేశాల సందర్భంగా విషయంపై రచ్చ మొదలై ఇపుడు ఎన్వీ రమణ, చంద్రబాబు పేర్లపై పార్లమెంటుతో పాటు జాతీయస్ధాయిలో పెద్ద రచ్చ మొదలైపోయింది. మొత్తానికి  ఈ విషయంలో జగన్ టైమింగ్ ను మాత్రం  మెచ్చుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: