జగన్ లేఖ వార్త : ఆ తెలుగు ఛానళ్లు, పత్రికలకు ఏమైంది..?

శనివారం రాత్రి.. ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం చోటు చేసుకుంది. దేశచరిత్రలో మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ అత్యున్నత న్యాయస్థానంలోని ఓ న్యాయమూర్తిపై ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రభుత్వ ప్రతినిధి బయటపెట్టారు. అంటే.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంపై నిందలతో రెండు వ్యవస్థల నడుమ ఘర్షణకు తెర తీచింది. విచిత్రం ఏంటంటే. ఇంత సంచలనమైన  వార్త చాలా టీవీ ఛానల్లు, పత్రికల్లో రానేలేదు.. సాక్షి టీవీలో తప్ప వేరే ఏ ఇతర టీవీ ఛానల్‌లోనూ లైవ్ రాలేదు. ఆ తర్వాత ఆ వార్త స్క్రోలింగ్‌లు కూడా రాలేదు.

నిన్న రాత్రి ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం విలేకరుల సమావేశం చాలా తెలుగు పత్రికల్లో కనిపించలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది.. ప్రధాన పత్రికలు, ఛానళ్లు ఈ వార్తను ఎందుకు మిస్ చేశాయి. విచిత్రం ఏంటంటే.. ఈ వార్తను జాతీయ పత్రికలు, టీవీలు ప్రముఖంగానే ప్రచురించాయి. మరి తెలుగు ఛానళ్లు, పత్రికలకు ఏమైంది.. ఈ విషయం పరిశీలిస్తే.. గతంలో హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ ఓ కారణంగా కనిపిస్తోంది. అదీ గాక జగన్ ఫిర్యాదు చేసింది ఏకంగా ఓ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి మీద.. అందుకే ఆ ఆరోపణలు ప్రచురించినా, ప్రసారం చేసినా కోర్టు ధిక్కరణ అవుతుందేమో అని ఆలోచించినట్టు కనిపించింది.

కోర్టులతో వ్యవహారం ఎందుకొచ్చిన గొడవ అని తెలుగు పత్రికలు, ఛానళ్లు ఆలోచించినట్టున్నాయి. నిన్న రాత్రి ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం విలేకరుల సమావేశాన్ని కేవలం సాక్షి, ఐన్యూస్, ఏపీ24*7, భారత్‌టుడే చానెల్స్ మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేశాయి. టీవీ5, ఏబీఎన్ తదితర టీడీపీ అనుకూల ఛానళ్లు ఎలాగూ పట్టించుకోవని తెలిసిందే. కానీ.. ఎన్టీవీ, టీవీ9 వంటి ప్రధాన చానెళ్ల కూడా ఈ వార్తను ఇవ్వలేదు. కోర్టు వ్యతిరేకం అవుతుందనే ఆలోచించాయా.. ఇంకా ఏమైనా కారణం ఉందా తెలియదు.

మరో విచిత్రం ఏంటంటే.. నమస్తే తెలంగాణ ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. అయితే ఆ తర్వాత ఎందుకో ఏమో నెట్ ఎడిషన్ ఈ పేపర్‌లో ఈ వార్తను తొలగించింది. వెబ్ సైట్ నుంచి కూడా తీసేసింది. మొత్తానికి ఈ వార్త గురించి ఎంత వెదికినా ఒకటి, రెండు చోట్ల తప్ప కనిపించనేలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: