మీడియా మంటలు: నా పేపర్ నా ఇష్టం.. అన్నీ మూసుకుని చదువుకో..!?

"అయ్యో అదేమిటంటే.. ఏకంగా ప్రభుత్వ ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేస్తే మీ పేపరులో వార్త కనిపించలేదేం...”
"నా పేపర్ నా ఇష్టం.. నా ఇష్టం వచ్చిన వార్తలే వేసుకుంటా.. అడగటానికి నువ్వెవరు.. “
"అసలు వార్త వేయలేదు.. కానీ ఇప్పుడు దానికి ఖండనలుగా అనేక ఇంటర్వ్యూలు వార్తలు వేస్తున్నారుగా..”
"నా పేపర్ నా ఇష్టం.. నా ఇష్టం వచ్చిన వార్తలే వేసుకుంటా.. అడగటానికి నువ్వెవరు.. “
అదేమిటి.. ఆ చంద్రబాబు సీఎం కుర్చీ నుంచి దిగిపోయి చానాళ్లయిందిగా.. ఇంకా ఆయన ప్రకటనలే సీఎం కంటే ఎక్కువగా మీ పత్రికలో వేస్తారేం.. సీఎం చంద్రబాబా.. జగనా..?
"నా పేపర్ నా ఇష్టం.. నా ఇష్టం వచ్చిన వార్తలే వేసుకుంటా.. అడగటానికి నువ్వెవరు.. “

"మీ పేపర్‌లో ఎప్పుడూ ప్రభుత్వాన్ని తిట్టే వారి వార్తలే కనిపిస్తాయేం.. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందినవాళ్ల గురించి ఒక్క ముక్క కూడా కనిపించదేం.. "
"నా పేపర్ నా ఇష్టం.. నా ఇష్టం వచ్చిన వార్తలే వేసుకుంటా.. అడగటానికి నువ్వెవరు.. “
జగన్‌ను ఎవరు తిట్టినా పతాక స్థాయిలో ఇస్తారేం.. ఆ తిట్టింది అర్భకుడైనా అంత ప్రాధాన్యత ఇస్తారేం..
"నా పేపర్ నా ఇష్టం.. నా ఇష్టం వచ్చిన వార్తలే వేసుకుంటా.. అడగటానికి నువ్వెవరు.. “

అమిత్‌ షా, మోడీలు జగన్‌ ను తిట్టిన తిట్టుతిట్టకుండా తిట్టారని మొత్తం చూసినట్టే అన్నీ రాసేస్తారేం.. క్లోజ్డ్ డోర్ మీటింగ్ వివరాలు మీకు ఎలా తెలుసు.. కొంపదీని సీక్రెట్ కెమేరాలు పెట్టారా ఏంటి..  
"నా పేపర్ నా ఇష్టం.. నా ఇష్టం వచ్చిన వార్తలే వేసుకుంటా.. అడగటానికి నువ్వెవరు.. “
అవునూ.. మీ పేపర్లో ఎంత సేపూ ఆ అమరావతి రైతుల ఉద్యమం గురించి తప్ప.. మిగిలిన రెండు రాజధానుల్లో జనం ఏమనుకుంటున్నారో.. ఎక్కడా కనిపించదేమీ..
"నా పేపర్ నా ఇష్టం.. నా ఇష్టం వచ్చిన వార్తలే వేసుకుంటా.. అడగటానికి నువ్వెవరు.. “
సరే సర్లే.. ఇక నేను మీ పేపర్‌ వదిలేసి.. ఆ సోషల్ మీడియా వార్తలు చదువుకుంటాలే.. టాటా బైబై..
“ !?&$#@.....” 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: