ఆ విషయంలో కేసీఆర్, జగన్ ఇద్దరూ అట్టర్ ఫ్లాప్.. తిట్టుకుంటున్న జనం..?

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఆర్టీసీ బస్సు సర్వీసుల విషయంలో సమన్వయం సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు ప్రజలకు దసరా ఎంత ముఖ్యమైన పండుగో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున జనం తమ సొంత గ్రామాలకు వెళతారు. అలా వెళ్లే వాళ్లలో ఎక్కువగా ఆంధ్రా ప్రజలే ఉంటారన్న సంగతి తెలిసిందే. కేంద్రం  కరోనా నిబంధనలు ఎత్తేసినా.. ఇంకా ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానే లేదు.
ఆంధ్ర బస్సు సర్వీసులు తెలంగాణలో ఎక్కువ తిరుగుతున్నాయన్న కారణంతో ఆ వ్యవహారం తేలే వరకూ తెలంగాణలో ఏపీ సర్వీసులకు అనుమతి ఇవ్వకూడదని తెలంగాణ నిర్ణయించుకుంది. ఈ విషయంపై ఆంధ్రా అధికారులతో చర్చలు జరిపింది. హైదరాబాద్ సర్వీసులతోనే ఎక్కువ ఆదాయం పొందే ఏపీ.. ఈ విషయంలో మొదట ససేమిరా అన్నా తెలంగాణ పట్టుబట్టడంతో అడుగు వెనక్కి వేయక తప్పలేదు. చివరకు సర్వీసులు తగ్గించుకునేందుకు, కిలోమీటర్లు తగ్గించుకునేందుకు కూడా ఏపీ అంగీకరించింది.
ఇది జరిగి దాదాపు వారం రోజులు అవుతోంది. ఇంకా చిన్నా చితకా విషయాలపై రెండు ప్రభుత్వాలు అవగాహన కు రావాల్సి ఉంది. ఓవైపు పండుగ ముంచుకొస్తున్న అటు జగన్ కానీ.. ఇటు కేసీఆర్ కానీ ఈ విషయంలో చొరవ తీసుకుని పండుగకు బస్సులు నడిచేలా చర్యలు తీసుకోలేదు. మొత్తానికి పండుగ ముందు జనం నానా తిప్పలు పడుతూ సొంత ఊళ్లకు చేరేలా చేశారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.

ఇందుకు కారణాలు ఎన్నాయినా చెప్పుకోవచ్చు కాక.. కానీ జనం ఇబ్బందులు మాత్రం తీరలేదు కదా.. మరి ఆ మాత్రం సమస్యను పరిష్కరించలేక పోవడానికి కారణం ఏంటి.. జనం అంటే చులకనా.. లేక పరిష్కార సామర్థ్యం లేదనుకోవాలా..? కనీసం పండుగ ముందైనా సమస్యను పరిష్కరించి ఉంటే జనం సంతోషించే వాళ్లు.. కానీ.. హైదరాబాద్‌లోని ఆంధ్రాజనం అటు కేసీఆర్ కూ.. ఇటు జగన్‌కూ ఎవరికీ పట్టని వారుగా మిగిలిపోవడం మాత్రం దారుణమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: