హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు ఎన్ని కోట్లు దుబారా చేశాడో ఎల్లోమీడియా ఎప్పుడైనా చెప్పిందా ?
ఇక్కడ ఎల్లోమీడియా మరచిపోయిన విషయం ఏమిటంటే జడ్జీలపై జగన్ చేసిన ఫిర్యాదు విషయంలో ఏ జాతీయ పత్రిక కూడా జగన్ను తప్పుపట్టలేదు. పైగా జగన్ ఫిర్యాదు అంశాన్ని ఆరోజు సుమారు 19 ఇంగ్లీషు డైలీలు ప్రముఖంగా ప్రచురించాయి. తర్వాత జగన్ లేఖపై పాజిటివ్ గాను నెగిటవ్ గాను కామెంట్లు వచ్చాయి. అంతేకానీ జగన్ చేసిన ఫిర్యాదు వల్ల ఎవరి పరువు పోలేదు. జగన్ తన ఫిర్యాదులో చెప్పిన న్యాయమూర్తుల గురించే జాతీయస్ధాయిలో చర్చ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపైనే జగన్ పై మండిపోయిన ఎల్లోమీడియా పనికట్టుకుని నెగిటివ్ కామెంట్లను అచ్చెసిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ కు వ్యతిరేకంగా ఢిల్లీ బార్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శితో మాట్లాడించగానే అక్కడ అంతర్గత విభేదాలు మొదలయ్యాయి.
సరే జగన్ చేసిన ఫిర్యాదును పక్కనపెట్టేద్దాం. టైమ్స్ పత్రికతో జగన్ ప్రభుత్వం రూ. 8.5 కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటే మధ్యలో ఎల్లోమీడియాకు ఎందుకింత కడుపుమంటో అర్ధం కావటం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు సదరు ఎల్లోమీడియా తీసుకున్న వందల కోట్ల రూపాయల యాడ్ల మాటేమిటి ? తన సర్క్యులేషన్ కు రావాల్సిన యాడ్లకన్నా చాలా ఎక్కువే తీసుకున్నదనే ఆరోపణలకు సమాధానం చెప్పిందా ? అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కులని, ప్రభుత్వ కార్యక్రమాలకు లైవ్ కవరేజీ అని ఎంత డబ్బులు తీసుకున్నదో చాలామందికి తెలిసిందే. చంద్రబాబు హయాంలో తన అర్హతకు మించే వందల కోట్లరూపాయలను వివిధ రూపాల్లో దోచేసుకునేదన్న ఆరోపణలకు కొదవేలేదు. మరిపుడు తనకు అవకాశం లేదు కాబట్టి ఇతరులపై పడి ఏడిస్తే ఉపయోగం ఏమిటి ? పత్రికల్లో కనబడే యాడ్లన్నీ ప్రభుత్వానికి భజనే అన్న విషయం ఎల్లోమీడియా మరచిపోయిందా ?