ఎడిటోరియల్ : బీజేపీ హడావుడి... టీఆర్ఎస్ లో అలజడి ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఎన్నో అలజడులు , మరెన్నో ఆందోళనలు, మరెన్నో అనుమానాలు పెరిగి పోతున్నాయి.తెలంగాణలో టిఆర్ఎస్ కు మరో ప్రత్యామ్నాయం లేదు అని జబ్బలు చరుచుకున్నా, ఇప్పుడు పరిస్థితి మాత్రం ఆందోళన గా కనిపిస్తోంది. ఎప్పుడూ ఊహించని ఫలితాలను దక్కించుకోవడం తప్ప,  పెద్దగా ఏ సందర్భంలోనూ ఇబ్బంది లేకుండా రాజకీయం చేసుకుంటూ వచ్చిన టిఆర్ఎస్ కు ఇప్పుడు మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. బిజెపి క్రమక్రమంగా రాష్ట్రంలో పట్టు సంపాదించుకోవడం లో సక్సెస్ అవుతూ వస్తోంది .  




ఈ విషయంలో ఆ పార్టీలోని నాయకులు అంతా ఏకాభిప్రాయంతో దూసుకెళుతున్నారు. అసలు బిజెపి తరహాలో ఏకాభిప్రాయం లేక కాంగ్రెస్ పార్టీలు నామరూపాలు లేకుండా తెలంగాణలో చిన్నాభిన్నం  అయిపోయింది. కాంగ్రెస్ అలా బలహీనం కావడంతో బిజెపి తెలంగాణలో బలం పెంచుకుంది అనే విషయం అందరికీ తెలిసిందే.  గ్రేటర్ లో గెలిచిన ఆనందం కూడా లేకుండా బిజెపి పట్టు పెంచుకున్న తీరు టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ గెలుపు అవకాశాలపై అప్పుడే అనుమానాలు బయల్దేరడంతో, ఆ పార్టీ నాయకులు ఆందోళన పెరిగిపోతోంది. దానికి ముందుగానే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో, టిఆర్ఎస్ లో మరోసారి టెన్షన్ మొదలైంది. 2018 ఎన్నికలు నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన నోముల నర్సింహయ్య కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలిచారు.




 ఆ ఎన్నికల్లో బిజెపి కి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న బిజెపి ఆ స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నా, ఎప్పటి నుంచో అక్కడ ఎన్నికలకు సిద్ధమైపోతుంది. పరిస్థితులను తలచుకుని టిఆర్ఎస్ నేతలు కంగారు పడిపోతున్నారు.  ఒకవేళ అక్కడ ఫలితం తేడా కొడితే, కోలుకోలేని విధంగా టిఆర్ఎస్ దెబ్బ తింటుందని , అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయం పైన ఇప్పుడు టిఆర్ఎస్ వ్యూహ రచనలు చేసే పనిలో ఉంది. ఏది ఏమైనా బిజెపి తెలంగాణలో ఎదుగుతున్న తీరు టిఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అనడం లో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: