ఎడిటోరియల్ : కేసీఆర్ ముందు చూపు కాస్త ఆలస్యం ?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కింద పడినా తనదే పైచేయి అనే విధంగా ఆయన రాజకీయాలు ఉంటాయి. 2014 ఎన్నికల దగ్గర నుంచి చూసుకుంటే, ఆయన ప్రతి విషయంలోనూ ఈ విధంగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ మధ్య దుబ్బాక,గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఊహించని ఫలితాలను సాధించింది. అప్పటి వరకు తమకు తిరుగే లేదని, తమకు ఎదురు నిలిచే పార్టీ కానీ, నాయకుడు గాని లేడు అనే భ్రమలో ఉంటూ వచ్చిన కెసిఆర్ ఎన్నికల ఫలితాలు జ్ఞానోదయం కలిగించాయి. ఇదే వైఖరితో ముందు ముందు కూడా ఉంటే, టిఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని, బిజెపి అధికార పార్టీ గా మారిపోతుంది అనే భయం కలిగింది. ఆ భయంతోనే నష్ట నివారణ చర్యలకు దిగుతున్నారు.



 ముఖ్యంగా తెలంగాణ లో యువత టిఆర్ఎస్ దూరంగా ఉండడానికి గల కారణాలను కెసిఆర్ తెలుసుకున్నారు. మొన్నటి వరకు కేవలం ప్రగతిభవన్ వరకే పరిమితమై, పై పై స్థాయి రాజకీయాల్ని చేసుకుంటూ వచ్చిన కేసీఆర్ కు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది ? ఏంటి అనేది కేవలం నివేదికల ఆధారంగానే అంచనా వేసేవారు. కానీ వేదికలలో ఉన్న విషయం కంటే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే, రానున్న రోజుల్లో తిరుగుండదనే అంశంపై దృష్టి పెట్టిన కేసీఆర్ కొద్దిరోజులుగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ వస్తున్నారు.


త్వరలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలతో పాటు, త్వరలోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ మరింత అప్రమత్తమయ్యారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సంక్షేమ పథకాలు విషయంపైనే ఎక్కువగా దృష్టి సారించడంతో, నిరుద్యోగ సమస్య గురించి పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే పెద్దగా ఉద్యోగాల భర్తీ అంశంపై దృష్టి పెట్టలేదు. దీంతో యువతలో తీవ్ర నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.



టిఆర్ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందనే అభిప్రాయము కూడా ఎక్కువగా ప్రచారంలకి వెళ్లడం వంటి కారణాలతో యువత టిఆర్ఎస్ కు దూరమవుతూ వస్తోంది. ఇది గమనించే ఇప్పుడు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను తెప్పించుకుని పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ లు విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మొత్తం అన్ని వ్యవహారాలు పైన ఇదే విధంగా కేసీఆర్ అలెర్ట్ అయ్యారు.



 ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది పడకుండా, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ జెండా ఎగరవేసే విధంగా కెసిఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. కెసిఆర్ ముందు చూపుతోనే వ్యవహరిస్తారు. కానీ యువతను ఆకట్టుకునే విషయంలో ముందుచూపు కాస్తా వెనుకబడినట్టుగా వ్యవహరించడంతో, టిఆర్ఎస్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. కాస్త ఆలస్యం అయినా ఇప్పటికైనా మేల్కొనడంతో టీఆర్ఎస్ శ్రేణులు లో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: