హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ పై జస్టిస్ రాకేష్ కుమార్ లో ఎంత కసి పేరుకుపోయిందో తెలుసా ?

Vijaya
జగన్మోహన్ రెడ్డిపై జస్టిస్ రాకేష్ కుమార్లో ఎంతటి కసి పేరుకుపోయిందో అర్ధమైపోతోంది. ప్రత్యక్షంగా జగన్ను ఉద్దేశించి జస్టిస్ చేసిన వ్యాఖ్యలను చూస్తేనే ఆ విషయం అర్ధమైపోతోంది. డిసెంబర్ 31వ తేదీ అంటే ఈరోజు జస్టిస్ పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా అసందర్భంగా జగన్ను ఉద్దేశించి వ్యక్తిగతంగా చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా ఏ జస్టిస్ కూడా తాను విచారిస్తున్న కేసుల విషయంలో వ్యక్తిగతంగా ప్రభావితం కారు. కానీ రాకేష్ కుమార్ విషయంలో మాత్రం ఇది మొదటినుండి రివర్సులోనే నడుస్తోంది. దానికితోడు వివిధ కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిధిదాటి జస్టిస్ చేసిన అనేక వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కొన్ని వ్యాఖ్యలపై ప్రభుత్వం కోర్టులో కేసులు కూడా వేసింది. దాంతో పదవీవిరమణ చేసే చివరిరోజుల్లో తనను విచారణ నుండి తప్పుకొమ్మని ప్రభుత్వం కేసు వేయటాన్ని జస్టిస్ జీర్ణించుకోలేకపోయినట్లే ఉంది. అందుకనే విరమణ చేసేరోజు అసందర్భంగా జగన్ను డైరెక్టుగా ఎటాక్ చేస్తు చాలా వ్యాఖ్యలు చేశారు.



సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరికొందరు జస్టిసులపై జగన్ చేసిన ఫిర్యాదు కారణంగానే బదిలీలు జరిగాయని మండిపోయారు. జగన్ లేఖరాయటం వల్ల జరిగిన బదిలీల కారణంగా సీఎం పై కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని తీవ్రంగా ఆక్షేపించటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే జగన్ పై విచారణ జరుగుతున్న కేసులన్నీ సీబీఐ కోర్టులో జరుగుతున్నాయే కానీ హైకోర్టుతో ఏమీ సంబంధం లేదు. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన విచారణకు సీఐడీ సరైన సహకారం అందించలేదన్నారు. అందుకే కదా సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇక మూడు రాజధానుల విషయంపై మాట్లాతూ చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. అంటే రాకేష్ కుమార్ అభిప్రాయం ప్రకారం రాజధాని కేసుల విచారణ మరో పదేళ్ళు జరుగుతుందని అనుకుందాం. మరప్పటి వరకు మహేశ్వరిని రిటైర్ చేయకూడదని అంటారా ?




కేసుల విచారణ అనేది నిరంతర ప్రక్రియ. చీఫ్ జస్టిస్ గా ఎవరున్నారు ? జస్టిస్ గా ఎవరున్నార్నది అప్రస్తుతం అన్న విషయాన్ని జస్టిస్ మరచిపోయినట్లున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఎలా వ్యాఖ్యలు చేశారో అదే విధంగా జగన్ కూడా న్యాయ నిపుణులపై ఫిర్యాదు చేశారని రాకేష్ కుమార్ సరిపెట్టుకోలేకపోతున్నారు. గుగుల్ సెర్చిలో 6093 అనికొడితే జగన్ విషయంలో దిగ్బ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయని జస్టిస్ చేసిన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతోనే జగన్ పై ఆయనకు వ్యక్తిగతంగా ఎంత కసి పేరుకుపోయిందో అర్ధమవుతోంది. ఎందుకంటే సీబీఐ కోర్టు విచారణలో ఉన్న కేసులపై జస్టిస్ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? జగన్ దోషా లేకపోతే నిర్దోషా అన్నది విచారణ తర్వాత తేలుతుంది. మరింతలోనే జస్టిస్ జోక్యం చేసుకుని అసందర్భంగా వ్యాఖ్యలు చేయటం ఏమిటి ?



మొత్తం మీద చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జస్టిస్ చేసిన కొన్ని వ్యాఖ్యలను సుప్రింకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాకేష్ విచారణ జరుపుతున్న కేసుల్లో కొన్నింటి విచారణను నిలిపేసింది. దాంతో జస్టిస్ అహం దెబ్బతిన్నట్లే అనుమానంగా ఉంది. అందుకనే ఉద్యోగ విరమణ చేసే ముందురోజు జగన్ పై తనలో పేరుకుపోయిన కసినంతా ఒక్కసారిగా బయటపెట్టుకున్నట్లే ఉంది. పైగా తన వ్యాఖ్యలన్నింటినీ రికార్డు చేస్తున్నట్లు ఆయనే స్వయంగా చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ఇదే విషయాన్ని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సుప్రింకోర్టులో కేసు వేస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: