హెరాల్డ్ ఎడిటోరియల్ : వార్ వన్ సైడే..జగనోరు విలవిల

Vijaya
ఇంతకాలం పై చేయి ఎవరదనే విషయంలో ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య అనేక వివాదాలు రేగాయి. అయితే అంతిమంగా నిమ్మగడ్డదే పై చేయని సుప్రింకోర్టు తాజా తీర్పుతో తేలిపోయింది. దాంతో మార్చి 31వ తేదీ వరకు నిమ్మగడ్డ ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. సుప్రింకోర్టు తీర్పు రావటం ఆలస్యం వెంటనే నిమ్మగడ్డ వన్ సైడ్ బ్యాటింగ్ మొదలుపెట్టేశారు.  



సుప్రింతీర్పుకు ముందే ఓ జాయింట్ డైరెక్టర్ ను ఉద్యోగంలో నుండి తీసేశారు. తర్వాత కమీషన్ సెక్రటరీని హఠాత్తుగా ప్రభుత్వానికి సరండెర్ చేసేశారు. దాంతో కమీషన్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైపోయింది. ఇక సుప్రింకోర్టు తీర్పు తర్వాత పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజాశంకర్ ను బదిలీచేసేశారు. అంతేకాకుండా వారి సర్వీసు రికార్డుల్లో వారిద్దరినీ అభిశంసిస్తున్నట్లుగా రికార్డు చేయాలని ఆదేశించారు.




తర్వాత చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో పాటు తిరపతి అర్బన్ ఎస్పీని బదిలీ చేసేశారు. పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, కమీషనర్ గా ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించారు. ఒక్కో పోస్టుకు ఒక్కో పేరును కాదు మూడేసి పేర్లను ప్రతిపాదించమని ఫైల్ ను తిప్పికొట్టారు. తాను యాక్షన్ తీసుకున్న కలెక్టర్లు, ఎస్పీని జీయేడికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. అంటే వీళ్ళకు ఎన్నికలయ్యేంతవరకు పోస్టింగ్ వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.




ఇది మొదలు మాత్రమే అని ప్రభుత్వానికి అర్ధమైపోయింది. ఎందుకంటే మార్చి 31వ తేదీన రిటైర్ అయ్యేలోగా ప్రభుత్వంపై తనకున్న కోపాన్నంతా తీర్చుకోవాలని డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే పంచాయితి ఎన్నికలు అయిపోగానే వెంటనే అప్పుడెప్పుడో వాయిదాపడిన జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు. అప్పుడు కూడా తనిష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తారనటంలో సందేహం లేదు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలంటారు.




అంటే ఏదో రూపంలో మార్చి 31వ తేదీవరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలయ్యేట్లుగా నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తునే ఉంటారు. దీన్నిబట్టి అర్ధమవుతున్నదేమంటే నిమ్మగడ్డ ఏమి చేసినా జగన్ చూస్తు ఊరుకోవటం తప్ప వేరేదారి లేదు. తనకిష్టం లేకపోయినా నిమ్మగడ్డ ఇచ్చే ఆదేశాలను, తీసుకుంటున్న యాక్షన్ను ఆమోదించక జగన్ ప్రభుత్వం చేసేదేమీ లేదు. మొత్తానికి నిమ్మగడ్డ మిగిలిన పదవీకాలన్ని ఫుల్లుగా వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తారనటంలో సందేహం లేదు. కాబట్టి నిమ్మగడ్డ బ్యాటింగ్ కు జగన్ విలవిలల్లాడటం తప్ప చేయగలిగేదేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: