ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకోవడం, అందుకు సంబంధించి ప్రకటన కూడా చేయడం, రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టాలన్న షర్మిల నిర్ణయంపై అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు. తెలంగాణా క్షేత్రస్ధాయిలో జరుగుతున్న చర్చ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.


తెలంగాణాలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముద్ర చాలా ఎక్కువే ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, - ఔటర్ రింగ్ రోడ్డు - మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పన లాంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ హయాంలో వచ్చినవే.


ఇక ఉచిత విద్య - ఉచిత విద్యుత్ - ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాల గురించి చెబితే వైఎస్సారే గుర్తుకొస్తారు.  పైన వివరించిన అంశాలు అనుకూల అంశాలు కాగా -


"వైఎస్సార్ రాష్ట్ర విభజనకు నూరు శాతం వ్యతిరేకం.  తెలంగాణా దృష్టిలో ఇది అతి పెద్ద వ్యతిరేఖ అంశం, అత్యంత ప్రతికూల అంశం. మా రాష్ట్రానికి మా పాలకులు కావాలి గాని, వెరెవరో మేము వద్దనుకున్న ఆంధ్రా వాళ్ల పాలన, మాకు వద్దే వద్దని అంటారు.


ఇప్పుడు వైఎస్ఆర్ బ్రతికివచ్చి, స్వంతంగా పోటీ చేసి తెలంగాణాలో అధికారంలోకి రావటం అసంభవం. కాంగ్రెస్ వాడిగా ఐతే, కొంతవరకు జనంలొ తిరగొచ్చు.కాని, ఓటమి ఖాయం. తెలంగాణా ఏర్పడ్డాక ఏడెనిమిదేళ్ళకి తగుదునమ్మా అంటూ తెలంగాణా రాజకీయాల్లో వైఎస్ షర్మిల అడుగెడితే పోలోమని ఓట్లెసేస్తారనేది భ్రమే! ఇవిప్పుడు జనాలు బహిరంగంగా చెప్పేస్తున్న మాటలు.


వైఎస్సార్ హయాంలో కేసీయార్ ప్రత్యేక తెలంగాణా గురించి మనసులోనైనా తలచేందుకు ప్రయత్నించలేదు. అసెంబ్లీలో విజయ రామారావు, హరీష్ రావు లాంటి తెలంగాణా కాంగ్రెస్ నేతలు మాట్లాడినా వైఎస్ రాజశేఖరరెడ్డి విపరీతంగా వాయించేసేవారు. దాంతో మళ్ళీ ఎవరు తెలంగాణా విభజనపై నోరెత్తే సాహసం చేయలేదు.


వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో కేసీయార్ కు ఎక్కడలేని ధైర్యం వచ్చి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ఊపందుకునేలా ముందుకు నడిపించారు. 2014 లో ప్రత్యేక తెలంగాణా ఏర్పడిందే మూడు ముఖ్య అంశాల సాధన కోసం మాత్రమె-అవే నీళ్ళు, నిధులు,  నియామకాలు, .బాష, యాస, ఆత్మగౌరవం అనేవి నినాదాల పట్టాలు వాటిపైనే ఉద్యమ రధం వేగంగా నడిచింది.


ఆ తరవాత ఉద్యమాన్ని హైజాక్ చేసి కబుర్లు కాకరకాయలు తెలంగాణా నుడికారంతో, యాస బాషలో కలిపి కొట్టేసి, అధికారంలోకి వచ్చిన మాయల మరాఠి కేసీఆర్. కొద్దిరోజుల క్రితం కేసీఆర్ వైభవం ముందు మాట్లాడలేని తెలంగాణా సాధారణ ప్రజలు, ఇప్పుడు కేసీఆర్ చమడా వలిచేసేలా ప్రశ్నించటానికి సిద్ధమయ్యారు. ఇదంతా జనంలో నిశ్శబ్ధంగా వచ్చిన తేటైన మార్పు. మాయల మరాఠి కాస్త మోసగాడని ఉదాహరణలు చెపుతూ బహిరంగ వ్యతిరేఖత ప్రదర్శిస్తున్నారు.  


అయితే ఏ లక్ష్యంతో అయితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం వచ్చిందో ఆ లక్ష్యం కేసీయార్ సీఎం అయి ఏడు సంవత్సరాలు గడిచినా నెరవేర లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ చేయలేదు. ఉపాధి అవకాశాలు దాదాపు మృగ్యం. ఇక ఆత్మగౌరవం అంటే దొర పాదాల చెంత తలపెట్టిన వాడికి, లేదా కేసీఆర్ మెడ పట్టుకున్న వాడికే. ఇదే విషయాన్ని తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా ఉన్న జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తో పాటు అనేక మంది ఉద్యమకారులు కేసీయార్ ను తిడుతు తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.  


ఇలాంటి నేపధ్యంలో కేసీయార్ అధికారానికి ప్రత్యామ్నాయం నిర్మించటంలో కాంగ్రెస్, టీడీపీలు పూర్తిగా వైఫల్యం చెందాయనే చెప్పాలి. బీజేపీ కి నాడు అంత సీన్ లేదనే అనుకోవాలి. ఇటువంటి నేపధ్యంలోనే కేసీయార్ వైఫల్యాల ఆధారంగానే రాజకీయ శూన్యతను భర్తీ చేయటం కోసమే వైఎస్ షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని సంకల్పించిందనేది సమాచారం.


మీడియాతో షర్మిల మాట్లాడుతూ తెలంగాణా వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఉచిత విద్య అందుతోందా ? వైద్యం అందుతోందా ? ఇళ్ళ పట్టాలు ఎంతమందికి అందాయి ? రైతులు సంతోషంగా ఉన్నారా ? ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయి? అంటు ప్రశ్నించటం గమనార్హం. అంటే షర్మిల తన కొత్త పార్టీ అజెండా ఆ ప్రశ్నలతోనే తెలిసిపోతుంది. అయితే కేసీఆర్ వైఫల్యాలు, వైఎసార్ చేసిన అభివృద్ధి చూపుతూ వైఎస్ షర్మిల చెయబోయే విన్యాసాలను తెలంగాణా వాళ్ళు నాటకంగానే భావిస్తారు. అయితే జి హెచ్ ఎం సీ ప్రాంతంలొ ఆంధ్ర ప్రజలు ఉన్నచోట ఈ ప్రయత్నం కొన్ని ఓట్లు చీల్చటానికి ప్రయత్నించవచ్చు. కాని వైఎస్ లాంటి తెలంగాణా వ్యతిరేఖి కూతురుగా ఆమె పప్పులిక్కడ ఉడకవని అంటున్నారు.


ఇంకా రెడ్డి వర్గాలు, ఆమె వైపు చూసే అవకాశం లేదు. రెడ్లు వేరు. మతం మార్చుకున్న రెడ్లు వేరు, అని తెలంగాణా రెడ్లు ఖచ్చితంగా విభజిస్తారు. వైఎస్ కుటుంబాన్ని ప్రత్యేకించి  "బైబిల్ పట్టుకొని తిరిగే విజయమ్మ షర్మిలను చూసి" వారిని తెలంగాణా రెడ్డి సామాజిక వర్గం, అని అనుకోరు. సరికదా! వాళ్లు రెడ్లే మిటి? అంటారు. ఈ విషయం రెడ్లే కాదు సాధారణ ప్రజలమాట కూడా! తెలంగాణ రెడ్లు వైఎస్ షర్మిలతో కలిస్తే 'వాళ్ళూ రెడ్లేనా అనేలా అస్థిత్వం కోల్పోవటం' ఖాయం.


ఆంధ్రప్రదేశ్ లో వైసీపి అధికారంలోకి వచ్చాక నిరంతరం జరిగే హిందూ వ్యతిరేఖత, మతమార్పిళ్ళు శరవేగంగా వైసీపి మీద భ్రమలు తొలిగి పోతున్నాయి. చర్చీలు, మత ప్రచారం ప్రతి చోట సమాజంలో ఒక దిన చర్యగా మారిపోయింది. పాస్టర్లకు ఆకర్షనీయమైన జీతభత్యాలు ఏర్పాటైనాయి. రాజుగారు తలిస్తే దెబ్బలకు కొదవ ఉండదని - దేవాలయాల కూల్చివేతలు, దేవీదేవతా విగ్రహాలను విరగ్గొట్టటం, దేవాలయ రథాాలను విరగొట్టటం - ఇవన్ని చూస్తుంటే ఔరంగజేబు తదితర తురుష్కుల పాలనకాలం గుర్తుకు వస్తుంది. జగన్ ప్రభుత్వం ఇప్పటికే అగ్రవర్ణ వ్యతిరేఖత ఎదుర్కొంటుంది. మిగతా హిందూ సమాజము ఇంకా గుర్తించాలి.


షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్ జన్మతః బ్రహ్మణుడు ఆతరవాత బాప్టిజం తీసుకొని (మతం మార్చుకొని) క్రిస్టియన్ అయ్యాడు. షర్మిల తెలంగాణా రాజకీయ రంగ ప్రవేశానికి మంది, మార్బలం, మనీ, మార్కెటింగ్, సర్వం వెనక ఉండి నడిపించేది బ్రదర్ అనీల్ కుమార్ మాత్రమె. ఇదంతా చూస్తుంటే షర్మిల "క్రీస్టు బాణమే" అని చెప్పక తప్పదు.



తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెడితే, అసలు ఆమెకు తెలంగాణకి ఏం సంబంధం? అని ప్రశ్నించే వారి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే తెలంగాణ ప్రజలను మెప్పించేందుకు, తన ఇక్కడి అభ్యర్దిత్వాన్ని ఒప్పించేందుకు, షర్మిల దగ్గర ఒక వ్యూహం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.


ఇందుకు సమాధానం షర్మిల దగ్గర సిద్ధంగా ఉంది అదేమంటే తాను తెలంగాణ కోడలినని ప్రచారం చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ స్వస్థలం ఖమ్మం జిల్లా.  ఆయన పెరిగింది హైదరాబాద్ ‌లోనే. ఈ లెక్కన తాను తెలంగాణ కోడలినని షర్మిల చెప్పనున్నారని, ఆ రకంగా తనకు ఇక్కడ రాజకీయాలు చేసే అర్హత ఉందని ఆమె ప్రచారం చేసుకోనున్నారని తెలుస్తోంది. తనకు ఏపీతో పాటు తెలంగాణ కూడా సమానమే అని చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


అది యదార్ధమే కావచ్చు కాని, గతంలొ ఆమె ఎప్పుడూ తాను తెలంగాణా కోడలినని ఒక్కసారి కూడా చెప్పిన దాఖలాలు లేవు. దీన్ని తెలంగానా వాసులు వేరే విధంగా చూస్తారు. ఆంధ్రులు మర్యాదకైనా "సరే మంచిది" అంటారు. తెలంగాణా జనంతో ఇలాంటి విషయాల్లో మొదటికే మోసం వస్తుంది.


“వైఎస్ షర్మిల - జగన్, కేసీఆర్, బిజేపి బాణం కాకపోవచ్చు అయితే ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలినబాణమే! అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడేళ్ళ జగన్ పాలన చూసిన అధిక సంఖ్యాక ప్రజానీకం.” వైఎస్ కుటుంబం తొలి నుంచి క్రిస్టియానిటీలో కొట్టిమిట్టాడుతుంది. విరేమీ విదేశాల నుండి దిగుమతైన క్రిష్టియన్స్ కాదు. అంతా డబ్బు, అధికారం, అవసరం, అవకాశ కోసం ఏర్చి కూర్చుకున్నవే. ఎమైఎం పార్టీ లాగా తన సొంత ఓట్-బాంక్ వైఎస్ కుటుంబం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకునే ట్రయల్ కావచ్చు షర్మిల రాజకీయరంగ ప్రవేశం. ఇప్పటికే హిందువులపై  ఏపి ప్రభుత్వ కనుసన్నలలో జరిపే దమనకాండ, వారిని వేదించటాలు, దేవాలయ దేవీదేవతా విగ్రహాల విధ్వంసం తదితర విషయాలన్నీ పీఠాధిపతుల వరకు చేరాయి. పూర్తి హిందూ ఐఖ్యత ఏర్పడటం "ష్యూర్" అంటున్నారు. అలా అయితే షర్మిల ప్రయోగం అంతా అట్టర్-ఫ్లాపే. జగన్ కు కూడా తీరని అవమానమే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: