హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి హీటెక్కించేస్తున్న తికాయత్ పిలుపు

Vijaya

గడచిన మూడు మాసాలుగా జరుగుతున్న రైతుల ఉద్యమం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడికే హీటెక్కించేస్తోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా గురువారం కొన్ని రాష్ట్రాల్లో వేలాదిమంది రైతులు నిర్వహించిన  రైలురోకో కేంద్రంలో కలకలం రేపింది. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో రైలురోకో వల్ల పదులసంఖ్యలో రైళ్ళు గంటల తరబడి ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఒకేసారి ఇన్ని రాష్ట్రాల్లో వేలాదిమంది రైతులు తమ కుటుంబాలతో సహా వచ్చేసి  గంటల కొద్దీ రైలుపట్టాల మీద కూర్చుంటారని ఎవరు ఊహించలేదు. రైతుల రైలురోకోను ఎలా అడ్డుకోవాలో అర్ధంకాక ఎక్కడిక్కడ ఉన్నతాధికారులు చేతులెత్తేశారు.




ఇదే సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ నేత, రైతుఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న రాకేష్ తికాయత్ ఇచ్చిన పిలుపు కేంద్రంలో వణుకు పుట్టిస్తోంది. తికాయత్ పిలుపంటే ఉత్తరప్రదేశ్, హర్యానాలోని రైతులకు ప్రధానంగా జాట్ వర్గానికి ఎంతో గురి. అందుకనే తికాయత్ ఎప్పుడు నిరసనలకు పిలిపిచ్చినా లక్షలాది మంది రైతులు రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. ఇపుడా తికాయతే పంటలను తగులబెట్టుకునేందుకు రెడీగా ఉండాలని ఇచ్చిన పిలుపు సంచలనంగా మారింది. పై రాష్ట్రాల్లో తొందరలో పంటలు కోతకు వస్తుంది. తమ పంటలను కోతలు కోసేబదులు తగలబెట్టడానికి, త్యాగాలు చేయటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. అంటే తికాయత్ పిలుపులో మర్మం ఏమిటంటే కోతల సమయం వచ్చినా కూడా రైతులెవరు పనుల కోసమని ఉద్యమం నుండి పొలాలకు వెళ్ళవద్దని చెప్పటమే.




పైగా వేలాది ట్రాక్టర్లలో రైతులు ఇంధనాన్ని పూర్తిగా నింపుకుని ఢిల్లీవైపు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని చేసిన పిలుపుతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో సంచలనంగా మారింది. మళ్ళీ రైతులు గనుక వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీవైపుకు దూసుకువస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అనే టెన్షన్ కేంద్రంలో పెరిగిపోతోంది. మొన్నటి జనవరి 26వ తేదీన ఢిల్లీ వీధుల్లో జరిగిన ట్రాక్టర్ల ర్యాలీ కారణంగా ఎంతటి ఉధ్రిక్తతలు చోటు చేసుకుందో అందరు చూసిందే. రైతుల ర్యాలీ అనంతర పరిణామాల కారణంగా కేంద్రప్రభుత్వంపై ప్రపంచదేశాల నుండి బాగా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. అలాంటిది మళ్ళీ తొందరలోనే ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీకి తికాయత్ పిలుపివ్వటం సంచలనంగా మారింది. మొత్తానికి రైతుఉద్యమం మాత్రం నరేంద్రమోడిలో బాగా హీట్ పెంచేస్తోందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: