ఎడిటోరియల్: ప్రతిఘటన మొదలైంది - “కేసీఆర్ కు కుక్కకు ఉండే విశ్వాసం” ఎలా ఉంటదో మరోసారి రుచి చూపబోతున్న తెలంగాణ!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ మధ్య తన ఉపన్యాసాలలో వాడే పదజాలం ఆయన స్థాయిని దిగజారుస్తుంది. ఉదాహరణకు ముఖ్యమంత్రి పదవి తన "ఎడమకాలి చెప్పు" తో సమానం అన్నారు. వెంటనే "పదేళ్లు అదే పదవిలో కొనసాగుతాను" అంటారు. అదే విషయమై ప్రతిపక్షాలు ఆయనను విమర్శిస్తున్నాయి.


ఎన్నికల ముందు నించి ఆయన ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేరలేదని - ఎన్నికల ముందు వాగ్దానాలు విరివిగా చేయటం తదుపరి వాటి ఊసే ఎత్తక పోవటం ఆయన నైజంగా మారిపోయింది. ప్రశ్నించిన వారిని ప్రజల ముందే అవమానించటం, హేళన చేయటం, బూతులు తిట్టటం, పశువులు జంతువులతో పోల్చటం ఆయనకు అలవాటుగా మారింది.


అంతేకాదు తన మిత్రపక్షం, రహస్యస్నేహితుడైన ఎంఐఎం కోసం హిందువులను తూలనాడటం ఇవన్నీ ఆయనను ప్రజల్లో పలుచన చేస్తున్నాయి. ప్రజలు తన పాలన సహించక పోయినా, ఆయనపై విశ్వాసముంచి ఓటేసి ఇప్పటికి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించే అధికారం తనకు తన కుటుంబానికి అందించారు. అలా  అందించిన పదవిని - ఎడమకాలి చెప్పుతో పోల్చటం - ఓటేసి, గౌరవించి గెలిపించిన ప్రజలను "కుక్కలతో పోల్చటం" తెలంగాణ వాసుల్లో ఆయనపట్ల అసహ్యం ఏహ్యభావం కలిగించటం జరుగుతూవస్తుంది. ఈ వ్యతిరేఖత గత రెండు ఎన్నికలవేళ భళ్ళున బ్రద్దలైంది. నియంతృత్వానికి రంద్రాలు పడ్డాయి. 


అలాంటి పరిస్థితుల్లో అయన పట్ల, ఆయన కుటుంబం పట్ల, అయన పార్టీకి పట్ల పెల్లుబికే వ్యతిరేకతను మూడవసారి ప్రదర్శించటానికి నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ప్రజలకు  అవకాశం వచ్చిన సందర్భమిది.


అలాగే ఇటీవల తెలంగాణ వార్తల్లో నిత్యం నానుతున్న పేరు “హాలియా” - నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కారణంగా అన్ని పార్టీలు అక్కడే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. అన్ని పార్టీలలాగే “హాలియా”లో బీజేపీ సమావేశం వాడిగా వేడిగా జరిగింది. హాలియా చౌరస్తా వరకు తెలంగాణ బిజెపి ఇంచార్జ్ తరుణ్ చుగ్ బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు.



అయితే డిల్లీలో అత్యవరస సమావేశం అంటూ పిలుపు రావటంతో ర్యాలీ మధ్యలోనే వది లేసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు తరుణ్ చుగ్. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో జరిగిన బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు ,రాష్ట్ర, జిల్లా స్థాయి బిజెపి నేతలు పాల్గొన్నారు.


కరీంనగర్ లో  “హిందూ గాళ్ళు బొందు గాళ్లు” అన్న కెసిఆర్ కు బుద్ది చెప్పారని, అలాగే పది రోజుల క్రితం నల్లగొండలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లను, అలాగే కొందరు మహిళలు తనను ప్రశ్నించటానికి ప్రయత్నిస్తే వాళ్ళను కుడా కుక్కలు అంటూ సంబోధించి తన నియంతృత్వ ధోరణి పబ్లిక్ లో ప్రదర్శించు కున్నారు.  “కుక్కలు” ఆన్న కెసిఆర్ కు కూడా - కరీంనగర్ ఫలితం లాంటి ఫలితాన్ని మరోసారి రుచి చూపించి  బుద్ది చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే అన్నారు.


ఇప్పటికే ఒక లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చామని పచ్చి అబద్ధాలాడిన మంత్రి  కేటీఆర్ దమ్ముంటే పోలీస్ బందో బస్తు లేకుండా హాలియ, ఉస్మానియా ప్రాంతాలకు వచ్చి అదే మాట చెప్పాలని సవాల్ విసిరారు.


ఈ రాష్ట్రంలో దళితుల తర్వాత మోసగించ బడింది గిరిజనులేనని 2018 ఎన్నికల్లో వచ్చి కుర్చీ వేసుకుని కాల్వల్లో నీరు పారిస్తానని అన్నాడు, కానీ కుర్చీ దొరకలేదేమో? అంటూ   మనమే కుర్చీ వేద్దామని ఆయన అన్నారు.


“దళితుడు ముఖ్యమంత్రి కాలేదు, పేదలకు మూడెకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మాటే లేదు, ఇంటింటికి నల్ల కనెక్షన్ ఊసే లేదు, ఫ్లోరైడ్ పోలేదు, ఇంటికో ఉద్యోగము లేదు.  నీ బిడ్డ ఒక్క ఏడాది ఖాళీగా ఉంటేనే తట్టుకోలేక పోయినవ్,  మరి మా సంగతి ఏంటి? శంకరమ్మకు రాజ్యసభ సీట్ అన్నవ్, ఇచ్చినవా?” అని ప్రశ్నించారు. పద్నాలుగు శాఖలకు మంత్రిగా చేసి ముఖ్యమంత్రి అభ్యర్ధి కూడా అయిన జానా రెడ్డి ఈ నియోజక వర్గానికి ఏం చేశాడని ప్రశ్నించారు.


అధికారంలో ఉన్నప్పుడు ఏం చెయ్యలేదు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నపుడు అయిన పోరాటం చేయలేదు ఇలాంటి నాయకుడు ఉంటే ఏంటి? పోతే ఏంటి? అని అయన ప్రశ్నించారు. పది జిల్లాలు పాలించే కేసీఆర్ కు అంత గీర ఉంటే ఏడు వందల జిల్లాలు పాలించే మాకు ఎంత ఉండాలని ఆయన ప్రశ్నించారు. మీ మీద కేసులు అయితే రూపాయి ఖర్చు లేకుండా మీ తరపున పోరాడతానని ఆయన అన్నారు.


టీఆరెస్ కుండకు ఇప్పటికే మూడు రంధ్రాలు, ఒకటి దుబ్బాకలో నేను, రెండు జిహెచ్ఎంసి ఎన్నికల్లో, బీజేపీ పెట్టిందని, మూడవది సాగరోల్లు పెట్టాలి” అని అన్నారు.


కుక్కలు ఆన్న కెసిఆర్ కు కుక్క విశ్వాసం ఎలా ఉంటది అనేది చూపించాలని అన్నారు. ఈ సభ ద్వారా తెరాస పతనం ఖాయం అయిందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: