హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

Vijaya
మరో మూడు నెలల్లో తెలుగుదేశంపార్టీ బేస్ కూలిపోబోతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదురైన విషయం తెలిసిందే. చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా 23 ఎంఎల్ఏలకు మాత్రమే టీడీపీ పరిమితమైపోయింది. తనను దారణంగా చావుదెబ్బ కొట్టిన జగన్మోహన్ రెడ్డిపై కసి పెంచేసుకున్న చంద్రబాబునాయుడు ఒక పద్దతిలో వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది బాగా  పెడుతున్నారు. అసెంబ్లీలో బలం లేకపోయినా జగన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నారు ? ఎలాగంటే శాసనమండలిలో ఉన్న బలం కారణంగా. అవును అసెంబ్లీలో బలం లేకపోయినా మండలిలో మాత్రం టీడీపీదే మెజారిటి. ఈ కారణంగానే అసెంబ్లీలో అడ్డుకోలేకపోయిన బిల్లులను మండలిల్లో అడ్డుగోలుగా అడ్డుకుంటున్నారు. దీంతో జగన్ కు చిరాకులు ఎక్కువైపోయి ఆమధ్య అసలు మండలి రద్దుకే సిఫారసు చేయించారు.



సరే అదంతా గతం అయిపోయింది. భవిష్యత్తు ఏమిటంటే మరో మూడు నెలల్లో శాసనమండలిలో కూడా వైసీపీదే పై చేయి కాబోతోంది. ఇపుడు మండలిలో టీడీపీ బలం 29 కాగా వైసీపీ బలం కేవలం 11 మాత్రమే. అయితే ఏకకాలంలో టీడీపీ బలం తగ్గిపోయి వైసీపీ బలం పెరిగబోతోంది. మార్చిలో వైసీపీకి ఆరుగురు నేతలు ఎంఎల్సీలుగా ఎన్నికవ్వబోతున్నారు. వీరంతా ఎంఎల్ఏల కోటాలో ఎన్నికవ్వబోతున్నారు. ఇక మేలో కూడా మరో ముగ్గురి పదవీకాలం ముగియబోతోంది. ఇవి కూడా వైసీపీ ఖాతాలోనే పడబోతున్నాయి. అంటే మార్చి+మేలో వైసీపీ బలానికి ఒక్కసారిగా తొమ్మిది మంది యాడ్ అవుతున్నారు.



పై రెండు విధానాల్లో పెరగబోయే బలం ఒక ఎత్తైతే గవర్నర్ నియామకం, స్దానిక సంస్ధల కోటాలో భర్తీ అవబోయే స్ధానాలు మరోఎత్తు. గవర్నర్ కోటాలో నాలుగు, స్ధానిక సంస్దల కోటాలో భర్తీ అవ్వబోయే 11తో కలుపుకుంటే వైసీపీకి బలం 29కి పెరుగుతుంది. అంటే స్ధానిక సంస్ధల కోటాలో ఇప్పటికే మూడుస్ధానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం మీద ఒకవైపు టీడీపీ బలం క్షీణిస్తుంటే అదే సమయంలో వైసీపీ బలం పెరుగుతోంది. ఇక జూన్ తర్వాత వచ్చే ప్రతి ఖాళీ కూడా వైసీపీ ఖాతాలో పడేదే. దీంతో ఇటు అసెంబ్లీలో లాగే మండలిలో కూడా టీడీపీ బేస్ కూలిపోబోతోందన్నది స్పష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: