హెరాల్డ్ ఎడిటోరియల్ : పోలవరాన్ని ఇంత కంపు చేసేశాడా ?

Vijaya
పోలవారం, సోమవారం అంటూ అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబునాయుడు ఏ స్ధాయిలో పబ్లిసిటీ స్టంట్లు చేసింది అందరికీ తెలిసిందే. అయితే తాజాగా జరిగిన పరిణామంతో పబ్లిసిటీ స్టంటే కాదని చివరకు ప్రాజెక్టులో కంపు చేసిన విషయం బయటపడింది. ఈనాడు దినపత్రికలో పోలవరం ప్రాజెక్టులో భాగమైన 180 మీటర్ల  డయాఫ్రం వాల్ నీటిలో కొట్టుకుపోయినట్లు మొదటిపేజీలో ప్రచురించింది. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా తేల్చేసింది. దాంతో ఆశ్చర్యపోయిన ప్రభుత్వం అసలు డయాఫ్రం వాల్ విషయంలో ఏమి జరిగిందనే విషయంపై ఆరాతీసింది. విషయం తెలిసిన తర్వాత విస్తుపోయింది. 


ఈనాడు దినపత్రికలో చెప్పిన డయాఫ్రం వాల్ నిర్మాణం జరిగింది ఇపుడు కాదు. అప్పుడెప్పుడో చంద్రబాబు హయాంలోనే అదికూడా ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు దగ్గరి బంధువుకు చెందిన కాంట్రాక్టు సంస్ధే నిర్మించినట్లు బయటపడింది. ఇదే విషయమై జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన కమీషన్ల కోసం ఇష్టా రీతిన నిర్మించేందుకు కాంట్రాక్టు సంస్ధను వాడుకున్నట్లు మండిపడ్డారు. ముందుగా స్పిల్ వే తర్వాత స్పిల్ ఛానల్ నిర్మించాలన్నారు. తర్వాత వరద నీటిని మళ్ళించేందుకు వీలుగా కాఫర్ డ్యాంను కట్టాలన్నారు. ఆ తర్వాత డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.


అయితే వీటిని ఓ పద్దతి ప్రకారం కాకుండా చంద్రబాబు తన ఇష్టం వచ్చినట్లు నిర్మించేందుకు కాంట్రక్టర్ కు అనుమతిచ్చినట్లు ఆరోపించారు. లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వస్తుందని తెలిసి కూడా స్విల్ వే, స్పిల్ ఛానల్ , కాఫర్ డ్యాం కట్టకుండా ముందు డయాఫ్రం వాల్ నిర్మించేసినట్లు చెప్పారు. దాంతో ఆ తర్వాత వచ్చిన భారీ నిర్మాణం కారణంగానే దాదాపు రెండు నెలల పనులు ఆగిపోయిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అప్పట్లో హడావుడిగా కట్టిన 1.4 కిలోమీటర్ల డయాఫ్రం వాల్ లోని 185 మీటర్ల వాల్ కు ఇపుడు నష్టం జరిగిందన్నారు. వాస్తవం ఇలాగుంటే డయాఫ్రం వాల్ ఏదో తమ హయాంలో జరిగినట్లు కథనం ఇవ్వటంలో దురుద్దేశ్యం అర్ధమైపోతోందన్నారు. అప్పట్లోనే జరిగిన పనులపై కేంద్ర జలసంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా పనులు నాసిరకంగా ఉందని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. డయాఫ్రం వాల్ దెబ్బతినటంతో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏ స్ధాయిలో కంపు చేశాడనే విషయం ఇపుడు బయటపడింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: