పవన్.. ఆ ఒక్క పని చేస్తే.. ఏపీ సీఎం కావడం ఖాయం..?

పవన్ కల్యాణ్‌.. వకీల్ సాబ్ విజయంతో మంచి జోష్ మీద ఉన్న పవన్ కల్యాణ్.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. తన సిబ్బందికి కరోనా వచ్చినందువల్ల ముందు జాగ్రత్తగా క్వారంటైన్లో ఉన్నట్టు ప్రకటించారు. అయితే తిరుపతి ఉపఎన్నికల ప్రచారం నుంచి తప్పించుకునేందుకే పవన్ క్వారంటైన్‌లో ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఆ విషయాలు పక్కనపెడితే.. వకీల్ సాబ్‌తో పవన్ సత్తా ఏంటో మరోసారి రుజువైంది.


పవన్ కల్యాణ్‌ మంచి జనాకర్షణ కలిగిన నాయకుడు.. అందులో అనుమానం లేదు.. కేవలం జనాకర్షణే కాదు.. సామాజిక బలం కూడా కలిగిన నాయకుడు. కానీ.. ఆయనతో వచ్చిన చిక్కేమిటంటే.. ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేయరు.. పార్ట్‌ టైమ్ పాలిటిక్స్‌తోనే సరిపెడతారు. ఇందుకు ఆయన కొన్ని కారణాలు కూడా చెబుతారు. రాజకీయాల్లో పార్టీని నడిపించాలంటే డబ్బు కావాలి కదా.. నాకు సినిమాలు మాత్రమే వచ్చు.. అందుకే సినిమాల్లో సంపాదిస్తా.. రాజకీయాల్లో ఖర్చు చేస్తా అంటారు. అదీ ఆయన పాలసీ. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయం సీన్ మారుతోంది.


అయితే ఏపీలో మారుతున్న పరిస్థితుల్లో పార్ట్ టైమ్ పాలిటిక్స్‌ పనికిరావు. నిన్నటి వరకూ బలమైన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం రోజు రోజుకూ చతికిలపడుతోంది. ఈ సమయంలో బలమైన ప్రత్యర్థిగా ఖాళీగా ఉన్న స్థలాన్ని పవన్ కల్యాణ్‌ భర్తీ చేస్తే ఆయనకు మంచి రాజకీయ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం పాత్ర నుంచి టీడీపీ తప్పుకుంటుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ స్థానాన్ని భర్తీ చేస్తే పవన్ ఫ్యూచర్ బాగానే ఉంటుంది.


అలా చేయాలంటే పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలి. సినిమాలు పక్కనపెట్టి పూర్తిస్థాయిలో జనజీవితంలోకి రావాలి. ప్రజల తరపున పోరాడాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. పార్టీ నిర్మాణం చేసుకోవాలి. నాయకులను తీర్చిదిద్దుకోవాలి. ఇలా చేయగలిగితే టీడీపీ స్థానాన్ని జనసేన భర్తీ చేయడం పెద్ద కష్టం కాదు. అదే జరిగిదే.. 2024లో కాకపోయినా.. 2029లోనైనా పవన్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: