హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలు కోరుకుంటున్న మందు ఆపేయటం సబబేనా జగనూ ?

Vijaya
జనాలు కోరుకుంటున్నది అందివ్వటమే..జనాలందరికీ కావాల్సింది అందింటచమే నాయకుడి లక్షణం. ఇపుడిదే జగన్మోహన్ రెడ్డికి పెద్ద సమస్యగా మారిపోయింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా వైరస్ రోగులకు ఆయుర్వేదం మందు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పదిరోజుల క్రితం మందు పంపిణీని ప్రభుత్వం అడ్డుకున్నప్పటి నుండి రోజురోజుకు చుక్కల మందుకు డిమాండ్ పెరిగిపోతోంది. విచిత్రమేమిటంటే ఆనందయ్య ఇస్తున్న చుక్కల మందుపై ఎవరు, ఎలాంటి ఫిర్యాదులు చేయకపోయినా ప్రభుత్వం కల్పించుకుని మందుపంపిణీని నిలిపేసింది. దాంతో జనాలందరు జగన్ పై భగ్గుమంటున్నారు.



చుక్కల మందుపై క్లినికల్ ట్రయల్సని కొందరు, ఐసీఎంఆర్ ఆమోదం ఇవ్వాలని మరికొందరు, ఆయుష్ క్లియరెన్స్ లేదని ఇంకొందరు రోజుకో రకమైన వాదనలు వినిపిస్తు జనాల్లో కన్ఫ్యూజన్ క్రియోట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయుష్ లేదా ఐసీఎంఆర్ ఉన్నతాధికారులు చుక్కల మందులో ఉపయోగించే దినుసులను పరీక్షించి ఎలాంటి నష్టాలు లేవని తేల్చారు. చుక్కల మందు కరోనా వైరస్ తగ్గించినా తగ్గించకపోయినా వాడినందువల్ల ఎలాంటి నష్టమూ ఉండదని తేలిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా మందు పంపిణీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వటం లేదో అర్ధం కావటంలేదు. ఒకవైపేమో మూడో క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే కోవాగ్జిన్ , కోవీషీల్డ్ టీకాలకు అనుమతిచ్చేసిన ఇదే ప్రభుత్వం ఎలాంటి నష్టం లేదని తేలిన తర్వాత కూడా ఆనందయ్య చుక్కల మందును నిలిపేయటం.



చుక్కల మందును పంపిణీ చేస్తున్న ఆనందయ్యకు, ఆ మందు తీసుకుంటున్న జనాలకు ఎలాంటి సమస్యా లేనపుడు మధ్యలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో ? మందేలేని కరోనా వైరస్ కు వైద్యం పేరుతో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుండి లక్షల రూపాయలు గుంజేస్తున్నారు. పోనీ లక్షలరూపాయల ఫీజులు వసూలు చేసిన తర్వాత కరోనా తగ్గుతుందని గ్యారెంటీ ఇస్తున్నారా అంటే అదీలేదు. చాలాచోట్ల డెడ్ బాడీనే అప్పగిస్తున్నారు. ఆసుపత్రుల్లో వైద్యంకోసం చేరి లక్షల రూపాయలు వదిలించుకునే కన్నా ఉచితంగా ఇస్తున్న ఆనందయ్య చుక్కల మందే బెటర్ కదాని జనాలనుకుంటున్నారు. ఆనందయ్యేమి తన దగ్గరకు వచ్చి చుక్కల మందు తీసుకోమని ఎవరినీ అడగటంలేదు. నమ్మకం ఉన్నవాళ్ళే ఆయన దగ్గరకు వెళ్ళి మందు తీసుకుంటున్నారు. వైద్యం పేరుతో లక్షల రూపాయలు ఆసుపత్రులకు పోసేకన్నా ఉచితంగా ఇస్తున్న ఆనందయ్య మందువైపే జనాలు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని జనాలు కోరుకుంటున్న ఆనందయ్య చుక్కల మందును అందుబాటులోకి తేవటమే ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: