"ఆ విషయాలు" బయటపెట్టి.. ఈటల సెల్ఫ్గోల్ ..?
కానీ ఈటల ఆ విషయం మరిచినట్టుంది.. కేసీఆర్ ను విమర్శించే క్రమంలో ఆయన బయటపెట్టిన కొన్ని విషయాలు ఆయనకే ప్రమాదకరంగా మారాయి. అవేంటంటే.. కేసీఆర్తో తనకు ఐదేళ్ల క్రితమే గ్యాప్ మొదలైందని ఈటల రాజేందర్ చెప్పారు.. కానీ.. ఇది నిజమే అయినా.. ఈ విషయం ఈటల చెప్పాల్సిన సమయం కాదు.. మరి ఐదేళ్ల క్రితమే కేసీఆర్తో గ్యాప్ మొదలైతే.. ఇన్నాళ్లూ ఈటల ఆ పార్టీలో ఎందుకు ఉన్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది.. కేవలం అధికారం కోసమే ఈటల కేసీఆర్ నియంతృత్వాన్ని భరించినట్టు స్పష్టం అవుతోంది కదా.
మరో విషయం ఏంటంటే.. ఇప్పుడు కూడా ఈటల తనంతట తాను బయటకు రాలేదు.. కేసీఆరే అవమానకర రీతిలో ఈటలను బయటకు పంపారు. అంటే పదవి కోసం ఇన్నాళ్లూ కేసీఆర్ నియంతృత్వాన్ని భరించానని ఈటల ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. అలా కాకుండా కేసీఆర్ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈటల బయటకు వచ్చి ఉంటే.. ఇలాంటి డైలాగులతో ఉపయోగం ఉండి ఉండేది.
అలాగే రైతు బంధు పథకాన్ని బెంజ్ కార్లలో తిరిగేవాళ్లకు కూడా ఇస్తున్నారని ఈటల ఆరోపించారు. ఇది మంచి ఆరోపణే. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి.. ఈటల కుటుంబం కూడా రైతు బంధు సొమ్ము తీసుకుందని వివరాలు బయటపెట్టారు. ఆ వివరాలు నిజమే అయితే.. రైతు బంధు ఆరోపణలు కూడా ఈటల సెల్ఫ్ గోల్ కిందకే వస్తాయి. మొత్తానికి బీజేపీలో చేరే ముందు ఈటల చేసిన ఆరోపణలు పెద్దగా సంచలనం కలిగించలేదనే చెప్పాలి.