రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసిన రహస్యం ఏంటంటే..?
ప్రజలు జ్ఞాపకశక్తి మీద చిన్న చూపు ఉన్న ఈ మీడియా.. ఎప్పటికప్పుడు కొత్త కథనాలు పుట్టిస్తూనే ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా రెండు, మూడేళ్ల క్రితం.. నరేంద్ర మోడీ, జగన్‌లపై వరుసగా వేసిన కథనాలు చెప్పుకోవచ్చు. ఆ కథనాల్లో నరేంద్ర మోడీ ఓ మూర్ఖుడు, ఉన్మాది.. అధికార దాహం ఉన్న వ్యక్తిగా చాలా రోజులు రాసుకొచ్చారు. అది కూడా ఫుల్ పేజీలు ముద్రించేవారు. తమ కట్టుకథలకు మద్దతుగా మానసిక విశ్లేషకులు అంటూ కొందరిని తీసుకొచ్చే వారితో అవే విషయాలు చెప్పించేవారు.
ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం జరుగుతోంది. జగన్‌ను పిచ్చివాడుగా చిత్రీకరించే సాహసం చేస్తోంది అదే మీడియా. జగన్ తాను ఇప్పటికీ తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో మాట్లాడానని.. జీసస్‌తో చర్చించానని తరచూ మీటింగుల్లో అధికారులతో చెబుతాడంటూ కొన్ని కథలు రాసుకొస్తున్నారు. మొత్తానికి జగన్ ఓ చిత్త భ్రమల్లో ఉండే మూర్ఖుడుగా చిత్రీకరిస్తున్నారు. ఇలా రాయడం ద్వారా జగన్ పై పిచ్చివాడనే ముద్ర వేయడంతో పాటు.. జగన్.. మెజారిటీ ప్రజలైన హిందువులకు వ్యతిరేకం అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట.
అయితే జనం అంత పిచ్చివాళ్లేమీ కారు. గతంలోనే ఇదే మీడియా జగన్ లక్ష కోట్లు తిన్నాడని పుంఖానుపుంఖాలుగా రాసింది.. ప్రచారం చేసింది. వైఎస్‌ను సైతం ముఖ్యమంత్రి కాకముందు ఓ ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించింది. కానీ.. జనం వాటిని నమ్మారా.. లేదే.. అయినా ఎల్లో మీడియా మాత్రం తన ప్రయత్నం ఆపదు. అంతే.. అదంతే..