భారత నౌకా దళంలోకి బంగ్లాదేశ్ యుద్దనౌక ? !

 భారత నౌకా దళంలోకి బంగ్లాదేశ్ యుద్దనౌక ? !


భారత నౌకాదళంలోకి బంగ్లాదేశ్ యుద్ద నౌక వచ్చి చేరింది. ఆశ్చర్యం కాదు ఇది నిజం.  భారత సైన్యంలో  ముడు విభాగాలున్నాయి. పదాతిదళం, నౌకాదళం, వాయుసేన విభాగం.  ప్రతి దేశం కూడా యుద్దసామగ్రిని  మిత్ర దేశాల నుంచి కొనుగోలు చేయడం రివాజు.  ఆక్రమంలోనే భారత్ కూడా చాలా యుద్ద విమానాలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ యుద్ద సామగ్రిని ఇతర దేశాల నంచి కొనుగోలు చేయమని, ఇక నుంచి భారత్ లోనే మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ తో స్వదేశంలోనే యుద్ద సామగ్రి తయారవుతుందని పదే పదే చెబుతున్నారు. ఆ మేరకు ఉప్పందాలు కూడా జరిగాయి. భవిష్యత్ లో స్వదేశీ క్షిపణులను విదేశాలకు ఎగుమతి చేస్తారని రక్షణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  


తాజాగా  భారత నౌకా దళం లోకి బంగ్లాదేశ్ యుద్ద నౌక  బిఎన్ ఎస్ సముద్ర వచ్చి చేరింది. అది కూడా తూర్పు తీరం లోకి. విశాఖపట్నంలో  తూర్పు నావికాదళానికి చెందిన ఈ ఎన్ సి ఉంది.  ఇక్కడి జెట్టీ లోకి  బిఎన్ ఎస్ సముద్ర  ప్రవేశించ డానికి ప్రత్యేక కారణం ఉంది. బంగ్లాదేశ్ విముక్తి , నిమోచన కోసం 1971లో ఇండియా -పాకిస్తాన్ మధ్య యుద్ద జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ ను ఎదుర్కోనేందకు బంగ్లాదేశ్ భారత సైన్యం సాయం కోరింది. ఈ యుద్దంలో భారత్ , బంగ్లాదేశ్ సేనలు సంయుక్తంగా పోరాడి పాకిస్తాన్ పై విజయం సాధించాయి. బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రం లభించింది. ఈ చారిత్రాత్మక యుద్దం జరిగి  యాభై సంవత్సరాలు పూర్తవతుతోంది. ఈ సందర్భంగా  స్వర్ణ విజయ్ వర్ష్ వేడుకలు ఇరు దేశాలలోనూ నిర్వహిస్తున్నారు.  నాటి అపురూప ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఐదు రోజుల పాటు  ఈ  సంబరాలు జరుగుతాయి. బంగ్లా దేశ్ నేత బహదూర్ షేక్ ముజీబుల్ రెహమాన్ శత జయంతి కూడా ఏక కాలంలో రావడంతో, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలు జరుగుతున్నాయి. విశాఖపట్నం ఈఎన్ సి జెట్టీ వద్దకు  చేరుకున్న  బిఎన్ ఎస్ సముద్ర చేరుకోవడంతో  భారత నౌకా సిబ్బంది సంప్రదాయ బ్యండ్ మేళంతో స్వాగతం పలికారు. అంతేకాక, బంగ్లా దేశ్ నౌక సిబ్బందితో  విశాఖపట్నం ఈఎన్ సి ఛీఫ్ ఏబి సింగ్ సమావేశమయ్యారు. అత్యంత ఉత్సాహ భరితంగా ఈ కార్యక్రమం సాగింది.
------

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: