ఫేస్ బుక్ ఎందుకిలా చేసింది ?
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ తనను తాను మార్చుకునే క్రమంలో తొలి నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ సంస్థ కృత్రిమ మేథ విభాగం ఉపాధ్యక్షుడు జరోమే పెసెంటీ తన బ్లాగులో ఓ కొత్త విషయాన్ని ప్రకటించి, ప్రపంచానికి తెలియ పరిచారు. అందరినీ ఆశ్చర్యంలో పడేశారు. ఈ తాజా నిర్ణయం ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుంది ? అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించ లేదు. ప్రస్తుతానికి మాత్రం ఫేస్ బుక్ యాజర్లు ఇప్పటి దాకా అలవాటు పడిన ఓ సాంకేతికతను ఇకపై వినియోగించు కోలేరన్నది మాత్రం సుస్పష్టం.
మెటా సంస్థ ఫేస్ బుక్ గా ఉన్నసమయంలో.. వివరంగా చెప్పాలంటే దాదాపు దశాబ్ద కాలం క్రితం 2010లో ఓ నూతన సాంకేతికతను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. యూజర్ల వ్యక్తిగత ముఖాలను గుర్తించ వచ్చు వారి ఫోటోలను ట్యాగ్ చేయవచ్చు. అంతే కాకుంజడా చాలా సౌలభ్యాలు ఈ సాంకేతికతతో లభ్యమయ్యాయి. ఫేస్ బుక్ తెలియేజేస్తున్న లెక్కల ప్రకారం ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం యూజర్లలో దాదాపు మూడు వంతుల మందికి పైగా ఈ సాంకేతికతను వినియోగించుకుంటున్నారు.
భారత్అ సహా అగ్ర రాజ్యం అమెరికాతో పాటు పలు దేశాల్లో ఫేస్ బుక్ పై తీవ్ర విమర్శలున్నాయి. వ్యక్తిగత భద్రత, గోప్యతలను ఈ సంస్థ ప్రపంచానికి వెల్లడిస్తోందంటూ వివిధ దేశాల్లోని న్యాయ స్థానాల్లో కేసులు కూడా ఉన్నారు. దీంతో ఈ సంస్థకు వివిద దేశాల్లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం తలకు మించిన భారమవుతోంది. ఇది ఓ వైపు ఉంటే అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పాటు, చిన్నా చితకా దేశాలలో కూడా ఈ సంస్థకు వ్యతిరేకంగా సమాజిక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి ? అని ఫేస్ బుక్ చాలా కాలంలో తమ బృందాలతో అధ్యయనం చేసింది. ముందుగా సామాజిక ఆందోళలనకు గల కారణాలను అధ్యయనం చేసింది. అన్ని దేశాలలోనూ కామన్ గా ఉన్న వ్యక్తిగత వివరాల గోప్యత, వాటి భద్రత పై దృష్టి సారించింది. ఫేస్ బుక్ నూతన సాంకేతికత మెటావర్స్ వినియోగించు కోవడానికి నిర్ణచుకుంది. ఫేస్ బుక్ మెటా గా మారిన తరువాత తొలి నిర్ణయం వ్యక్తిగత గోప్యత పైనే వెల్లడించింది. త ద్వారా వివిధ దేశాల్లో జరుగుతున్న ఆందోళలను కొంత చల్లార్చవచ్చనేది మెటా సంస్థ ఆలోచన గా ఉండవచ్చు.
ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఫేస్ బుక్ నుంచి తొలగించడం వల్ల దాదాపు ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది పై దీని ప్రభావం పడనుంది. వారంతా ఈ సాంకేతికతను ఇక పై నినియోగించు కోలేరు. ఈ నెలలోనే ఇది అమలు కానుంది. ఆటోమేటిక్ ఆల్ట్ టెక్ట్సా (ఎఎటి) పై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశంది. దృష్టి లోపం ఉన్న వారు ఇప్పటి వరకూ ఈ సాంకేతికను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ ఫేస్ బుక్ లో ఓ సౌలభ్యం ఉండేది. అదేమిటంటే వీడియోలు, ఫోటోలలోని ముఖాలను ఫేస్ బుక్ దానంతట అదే గుర్తించేది. ఇకపై ఆ సౌలభ్యం యూజర్లకు లభించదు. వీడియోలు, ఫోటోలలోని వ్యక్తులు ఎవరు ? అనేది ఇతరులు గుర్తించడం సాధ్యం కాదు. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత కారణంగా తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని ఆందోళన చెందే వారిని సంతృప్తి పరచేందుకే మెటా తాజా ఈ నిర్ణయం తీసుకుంటన్నట్లు స్ఫష్టమవుతోంది.