గుంటూరు ముద్దు .. గుర‌జాల వ‌ద్దు.. కొమ్మాల‌పాటి స్పీడ్‌.. శంక‌ర్రావు సైలెంట్‌!

VUYYURU SUBHASH
ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జిల్లాల విభ‌జ‌న‌.. కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా.. చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా కొన్ని కొన్ని డివిజ‌న్ల‌ను వేరే ప్రాంతాల్లో క‌లుపుతూ.. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై చాలా చోట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు సెగ పెట్టేస్తోంది. వారు త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించ‌లేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తోన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు చెప్ప‌లేక సైలెంట్‌గా ఉంటూ ఉక్క‌పోత‌కు గుర‌వుతున్నారు. వినుకొండ, గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు పిడుగురాళ్ల కేంద్రంగా ప‌ల్నాడు జిల్లా ఉండాల‌ని.. త‌మ‌కు న‌ర‌సారావుపేట జిల్లా కేంద్రంగా వ‌ద్ద‌ని డిమాండ్ చేస్తున్నారు.
ప‌ల్నాడు ప్రాంతంలో అస‌లు న‌రసారావుపేట లేద‌ని వారు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ. ఆంజ‌నేయులు, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు దీనిపై పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తున్నారు. ఇక న‌ర‌సారావుపేట జిల్లాలో ఉన్న పెద‌కూ ర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాన్ని గుర‌జాల రెవెన్యూ డివిజ‌న్‌లో క‌లిపారు. దీనిని ఇక్క‌డి ప్ర‌జలు తీవ్రంగా వ్య‌తిరే కిస్తున్నారు. ముఖ్యంగా పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌.. స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు మండ‌లాలు.. గుంటూరు రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో కొన‌సాగుతు న్నాయ‌ని.. ఇప్పుడు వీటిని గుర‌జాల‌లో క‌ల‌పం స‌రికాద‌ని కొమ్మాల‌పాటి అంటున్నారు. దీనిని గుంటూరు రెవెన్యూ డివిజ‌న్‌గానే కొన‌సాగించాల‌ని కోరుతున్నారు. పోనీ.. ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. క‌నీ సం.. స‌త్తెన‌ప‌ల్లి రెవెన్యూ డివిజ‌న్ అయినా.. ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణ‌యానికి ప్ర‌భుత్వం ముందుకు రాక‌పోతే.. టీడీపీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు తాము సిద్ధ‌మ‌ని కొ మ్మాల‌పాటి హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప్ర‌ష‌భుత్వం ప‌ట్టించుకోవాల‌ని ఆయ‌న కోరుతున్నారు.
పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం అంతా గుంటూరుకు మ‌హా అయితే 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అదే గుర‌జాల‌కు వెళ్లాలంటే 100 కిలోమీట‌ర్లు.. చాలా వ్య‌య ప్ర‌యాస‌ల‌తో పాటు టైం వేస్ట్ అవుతుంది. పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గ రైతులు నానా ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంది. అందుకే వారు గుర‌జాల వ‌ద్దు, గుంటూరు ముద్దు అని ముక్త‌కంఠంతో నినందిస్తున్నారు. అయితే.. పెద‌కూర‌పాడులో ప్ర‌జ‌ల నుంచి ఇంత‌గా వ్య‌తిరేకిస్తున్నా.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు కూడా దూకు డుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంక‌ర్రావు మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉన్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
క‌నీసం.. ఇక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ఆయ‌న ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డం.. గుర‌జాల‌లో త‌మ‌ను క‌ల‌ప‌వ‌ద్ద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు చేస్తున్న డిమాండ్ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తున్నాయి. క‌నీసం.. ఇప్ప‌టికైనా ఆయ‌న స్పందించాల‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఇదేనా నియోజ‌క‌వ‌ర్గంపై ప్రేమ అంటూ.. శంక‌ర్రావును నిల‌దీస్తున్న ప‌రిస్థితి ఇక్క‌డ క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: