జగనూ.. రాజధానికో న్యాయం.. జిల్లాలకో న్యాయమా..?

జగన్‌ సర్కారు కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొత్త నిర్ణయం ఏమీ కాదు.. కొంతకాలంగా అనుకుంటున్నదే.. గతంలో జగన్ హామీ ఇచ్చిందే.. అయినా ఇప్పుడు చడీచప్పుడు కాకుండా కొత్త జిల్లాలను ప్రకటించడంతో కాస్త వివాదస్పదం అవుతోంది. దీనికి తోడు కొన్ని జిల్లా కేంద్రాల విషయంలోనూ.. మరికొన్నిచోట్ల రెవెన్యూ డివిజన్ల మార్పుల విషయంలోనూ.. కొన్నిచోట్ల ప్రాంతాల విషయంలోనూ వివాదాలు వస్తూనే ఉన్నాయి.


అయితే.. ప్రధానంగా జగన్ సర్కారు.. ప్రతి ఎంపీ సీటుకూ ఓ జిల్లా ఏర్పాటు చేయాలని నియమం పెట్టుకున్నారు. అలాగే.. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం మొత్తం ఒకే జిల్లాలోకి వచ్చేలా జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొన్నిచోట్ల ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు పక్క జిల్లా కేంద్రం అందుబాటులోనే ఉన్నా.. ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లి దూరంగా ఉన్న జిల్లాలో కలిపారు. ఇలాంటి ఇబ్బందులు కొన్ని జిల్లాలలో ఉన్నాయి. ప్రత్యేకించి రాజంపేట ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాగా ప్రకటించకుండా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయ్యింది.  


ఇలాంటి వివాదాల సమయంలో ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. జిల్లాకు దాదాపు మధ్య ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అలా చేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవని వివరించింది. అన్ని ప్రాంతాలకు అందుబాటులో అంటే మధ్యలో ఉండే ప్రాంతం నుంచే జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేశామని చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ నాయకలు ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నారు.


ఒక జిల్లా కేంద్రం విషయంలోనే.. అది జిల్లాకు మధ్యలో ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచిస్తోందని.. మరి ఇప్పుడు జగన్ సర్కారు ఎందుకు రాష్ట్రానికి ఓ మూలన ఉన్న విశాఖ రాజధాని అని అంటున్నారనే ప్రశ్న లేవెనత్తుతున్నారు.  జగన్ బాబూ.. జిల్లాకు ఓ న్యాయం.. రాజధాని ప్రాంతం అమరావతికి మరో న్యాయమా అంటూ జనం నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: