మోదీ బ‌డ్జెట్: కొత్త‌గా వందే భార‌త్ రైళ్లు వ‌చ్చాయ్‌

VUYYURU SUBHASH
 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో కొత్త యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్రంలో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే ప్ర‌భుత్వం ఈ సారి బ‌డ్జెట్‌లో కొత్త రైళ్లు ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చాక కొత్త రైళ్లు వేయ‌డం కంటే కొత్త రైల్వే లైన్ల నిర్మాణం మీదే ఎక్కువుగా దృష్టి పెడుతూ వ‌చ్చింది. రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు డ‌బ్లింగ్‌, ట్రిప్లింగ్ ప‌నుల‌పైనే ఎక్కువుగా ఫోక‌స్ చేస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు మాత్రం కొత్త‌గా వందే భార‌త్ రైళ్లు ప్ర‌వేశ పెడుతున్నారు.

ఈ రోజు బ‌డ్జెట్ ప్ర‌సంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే వ‌రుస‌గా 75 వారాల పాటు 75 వందే భారత్‌ రైళ్లను నడిపిస్తామని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్ర‌క‌టించారు. దీనిపై కేంద్ర ఆర్థిక‌మంత్రి నుంచి ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇక కొత్త‌గా వ‌చ్చే వందే భార‌త్ రైళ్ల‌ను పూర్తిగా లింకే హ‌ఫ్ మ‌న్ బుష్ కోచ్‌ల‌తో నిర్మిస్తారు.

ప్ర‌స్తుతం రాయ‌బేరీలీతో పాటు క‌పుర్తాల‌, చెన్నైల్లో ఉన్న కోచ్ ఫ్యాక్ట‌రీల్లో కూడా ఎల్ఎఫ్‌బీ కోచ్‌ల‌ను రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే యూపీలోని ప‌లు న‌గ‌రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వందే భార‌త్ రైలు స‌ర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇక కొత్త‌గా వ‌చ్చే ఈ రైళ్ల‌లో తెలంగాణ, ఏపీకి వాటా దక్కనుండ‌డం కాస్త విశేషం. ఇది మ‌న తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎంతో కొంత ఊర‌ట ఇచ్చే అంశం.

ఇక వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ర‌వాణాకు కూడా రైల్వే నెట్‌వ‌ర్క్‌ల‌ను ఉప‌యోగిస్తామ‌ని కేంద్ర మంత్రి ప్ర‌క‌టించారు. వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎరువుల స‌ర‌ఫ‌రాకే వాడుతున్నారు. క‌రోనా సంక్షోభం త‌ర్వాత రైళ్ల ద్వారా వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ర‌వాణా పెద్ద ఎత్తున చేప‌ట్టారు. ఈ ఫ‌లితాలు బాగుండ‌డంతో ఇప్పుడు చిన్న‌, స‌న్న‌కారు రైతుల ప్ర‌యోజ‌నాలు దృష్టిలో పెట్టుకుని కూడా రైల్వే కార్గో సేవ‌లు ప్రారంభిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: