డిబేట్‌: దేశం ముఖ్యమా.. మతం ముఖ్యమా..?

కర్ణాటకలో ఇటీవల మొదలైన హిజాబ్‌ వివాదం ఇప్పుడు కొత్త చర్చలకు తెరలేపుతోంది. ముస్లిం యువతులు తమ ముఖాలు పాక్షికంగా కనిపించకుండా హిజాబ్‌ ధరించి కాలేజ్‌కు రావడాన్ని అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత వారిని అనుమతించడం మరో వివాదానికి దారి తీసింది. ముస్లిం యువతులను హిజాద్‌తో కాలేజ్‌కు రానిస్తే.. తాము కాషాయ కండువాలతో వస్తామని కొందరు యువకులు సవాల్ చేయడం.. అది క్రమంగా కర్ణాటక అంతా పాకడంతో పెను వివాదంగా మారింది.


ఈ వివాదం నేపథ్యంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలపైనే కొన్ని మౌలికమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో అన్నింటికీ ప్రమాణమైనది భారత రాజ్యాంగమే.. దేశాన్ని నడిపించేది భారత రాజ్యాంగమే.. ఏ మతమూ కాదు.. అలాంటిది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సైతం కాలరాసేలా చెలరేగుతున్న వివాదాలు దేశాన్ని సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్నాయి. ఈ మాటలు తాజాగా మద్రాసు హైకోర్టు కూడా అంటోంది. దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టే కొన్నిశక్తుల ధోరణిపై మద్రాస్‌ హైకోర్టు  తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది.


కర్ణాటకలో తలెత్తిన హిజాబ్‌ వివాదం పై వ్యాఖ్యానిస్తూ దేశం ముఖ్యమా.. లేక మతం ముఖ్యమా అంటూ ప్రశ్నించడం నేటి దుస్థితికి అద్దం పడుతోంది. ఆలయాల్లో భక్తులకు డ్రెస్‌కోడ్‌ అమలు చేయాలని.. హిందువులు కాని వారిని ఆలయాల్లోకి రానివ్వకుండా నిషేధించాలంటూ తమిళనాడు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని జడ్జిలు అన్నారు. పేర్కొంది.


హిజాబ్‌, టోపీలను బట్టి  ఈ దేశం చీలిపోతోందా అని కోర్టు వ్యాఖ్యానించింది.  ఇది ఒకే దేశమా లేక మతం ఆధారంగా విభజనకు గురైందా అని ప్రశ్నించింది. మన దేశం లౌకిక దేశమన్న సంగతి మరచిపోరాదని గుర్తు చేసింది. దేశాన్ని మతం పేరుతో విభజించేందుకు కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తోందని తమిళనాడు హైకోర్టు వ్యాఖ్యానించింది. నిజమే కదా.. పైనల్‌గా ఈ దేశమే ముఖ్యం.. మతం కన్నా ఈ దేశమే ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: