జ‌గ‌న్ తాంబూలాలిచ్చేస్తున్నారు... వైసీపీలో ఒక్క‌టే టెన్ష‌న్‌...!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా.?  ఎప్ప‌టి నుంచో నేత‌లు వేచి చూస్తున్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు స‌ర్వం సిద్ధం చేసుకున్నారా?  ఇక‌, ప్ర‌క‌ట‌నే త‌రువాయా? అంటే.. ఔన‌నే సంకేతాలు వైసీపీ నుంచి వ‌స్తున్నాయి. ఈ నెల 18 లేదా 20 వ తేదీ లోగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని తాడేప‌ల్లి నుంచి వ‌చ్చిన స‌మాచారం. ఇప్ప‌టికే జాబితా కూడా రెడీ అయిపోయింద‌ని అంటున్నారు. ఒక‌టి రెండుపేర్లు త‌ప్ప‌.. మిగిలిన వారి విష‌యంలో సీఎం జ‌గ‌న్ క‌న్ఫ‌ర్మ్ అయ్యార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ప్ర‌భుత్వంలో పెరుగుతుంది.

పార్టీలో మాత్రం నాయ‌కుల‌కు పెరుగుతుంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌యం దిశ‌గా న‌డిపించేందుకు షార్ప్ షూట‌ర్లుగా ఉన్న‌వారికి పార్టీలో కీల‌క ప‌ద‌వులు ఇస్తారు. అదేస‌మ‌యంలో మ‌హి ళ‌ల‌కు.. మంత్రివ‌ర్గంలో మ‌రింత ప్రాధాన్యం పెంచ‌డంతోపాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఎక్కువ అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యాన్ని న‌ల్లేరుపై న‌డ‌క‌గా చేయాల‌ని సీఎం జ‌గ‌న్ బావిస్తున్నా రు. దీంతో ఇప్పుడు.. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న‌చాలామందికి అవ‌కాశం ద‌క్క‌లేక పోవ‌చ్చు అంటున్నా రు ప‌రిశీల‌కులు.

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కురెడ్డి సామాజిక వ‌ర్గంలో న‌లుగురు కీల‌క నాయ‌కులు మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఈ ద‌ఫా రెడ్డి వ‌ర్గానికి ఆశించిన మేర‌కు ప్రాధాన్యం ఉండ‌ద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో ఎస్సీల‌కు మ‌రింత ప్రాధాన్యం అదేవిధంగా బీసీల‌కు మ‌రింత గా ప‌ద‌వుల‌ను పెంచేం దుకు చూస్తున్నారు. త‌ద్వారా.. ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న బీసీల ఓటు బ్యాంకును బ‌దాబ‌ద‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, జ‌గ‌న్ తీసుకున్న తాజా న‌నిర్ణ‌యం.. రెడ్డి వ‌ర్గానికి, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఒకింత బాధ క‌లిగించేలా.. ఉంద‌ని తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. వారిని మ‌రో విధంగా సంతృప్తి ప‌రిచి..పార్టీ గెలుపును దృష్టిలో పెట్టుకుని.. నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: