సీమలో ఆ ముగ్గురు మంత్రులు అవుట్...?

VUYYURU SUBHASH
ఆంధ్ర ప్రదేశ్ లో 
 మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు గురించి చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..త్వరలోనే జగన్...మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి..వాస్తవానికి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పినట్లు...రెండున్నర ఏళ్లలోనే మంత్రివర్గంలో మార్పులు చేస్తానని అన్నారు..అంటే గత ఏడాది డిసెంబర్‌లో మంత్రివర్గంలో మార్పులు జరగాలి. మరి ఎందుకు జరగలేదు అనేది క్లారిటీ లేదు...అంటే మంత్రులకు ఇంకో ఆరు నెలలు ఛాన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గం గురించి చర్చలు నడుస్తున్నాయి...అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గంలో మార్పులు చేయొచ్చని ప్రచారం నడుస్తోంది..మరి జగన్ ఎప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేస్తారో క్లారిటీ లేదు గాని...కొందరు మంత్రులు మాత్రం తమ పదవులపై డౌట్‌గానే ఉన్నారు...ఇప్పుడున్న మంత్రుల్లో చాలామంది పదవులు పోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

రాయలసీమ విషయానికొస్తే ఖచ్చితంగా ముగ్గురు మంత్రుల పదవులు మాత్రం ఊడటం గ్యారెంటీ అని తెలుస్తోంది. సీమలో ఉన్న మొత్తం 6 గురు మంత్రులు ఉన్నారు....చిత్తూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కడపలో ఒకరు ఉన్నారు...ఇక వీరిలో ముగ్గురు పదవులు మాత్రం ఊడటం ఖాయమని తెలుస్తోంది. సరిగ్గా పని చేయకపోవడం, వివాదాల్లో ఉండటం, పైగా మంత్రులుగా తమదైన ముద్రవేయకపోవడం లాంటి అంశాలని చూసుకుంటే..ఆ ముగ్గురు మంత్రుల పదవులు ఖచ్చితంగా పోయేలా ఉన్నాయి.

ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణస్వామి, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంలని మంత్రివర్గం నుంచి తొలగించడం ఖాయమని తెలుస్తోంది. ఈ రెండున్నర ఏళ్లలో ఈ ముగ్గురు మంత్రులు తమ శాఖలపై పట్టు తెచ్చుకుని, తమదైన ముద్ర వేయడంలో విఫలం అయ్యారు. అలాగే వీరు పలు వివాదాల్లో కూడా ఉన్నారు. వీరిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్తితులని బట్టి చూస్తే నెక్స్ట్ వీరు మంత్రివర్గంలో కంటిన్యూ అవ్వడం కష్టమే అని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: