జ‌గ‌న్ నిర్ణ‌య‌మే భేష్‌.. వాళ్లంతా ఫుల్ హ్యాపీ...!

VUYYURU SUBHASH
కొన్ని కొన్ని నిర్ణ‌యాలు.. అప్ప‌టి వ‌ర‌కు బాధ‌గా ఉన్నా.. లేక సంచ‌నాలు సృష్టించినా.. త‌ర్వాత మాత్రం అద్భుత‌మైన ఫ‌లితాలు ఇస్తాయి. ఇప్పుడు ఇదే.. విష‌యం ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది. తాజాగా ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్‌ను ఆ ప‌ద‌వి నుంచి ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. దీనిపై ప్ర‌తికూల వ‌ర్గాలు.. ప్ర‌తికూల మీడియా భారీ ఎత్తున సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధిస్తున్నాయి. అయితే.. వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు స‌వాంగ్‌ను తిట్టిపోసింది.. ఆయ‌న వైసీపీ నాయ‌కుడు అంటూ సంబోధించి.. అప‌వాదులు అంట‌గ‌ట్టింది కూడా ఈ వ‌ర్గ‌మే. అయితే.. ఇప్పుడు మాత్రం మొస‌లి క‌న్నీరు కారుస్తూ.. స‌వాంగ్‌పై జాలి కురిపిస్తున్నాయి.

ఇక‌, సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని పోలీసు వ‌ర్గాలు స్వాగ‌తిస్తున్నాయి. ఎందుకంటే.. ఐపీఎస్ నిబంధ నల మేర‌కు ఒక కీల‌క ప‌దవిలో మూడేళ్ల‌కు మించి ఉండ‌కూడ‌దు. ఇది సుప్రీం కోర్టు కూడా గ‌తంలోనే స్ప‌ష్టం చేసింది. అందుకే.. చివ‌రి మూడేళ్లు ప‌ద‌విలో ఉండేవారికే అత్యున్న‌త ప‌ద‌వులు ఇవ్వాల‌ని.. కూడా సూచించింది. అయితే.. స‌వాంగ్‌కు నాలుగేళ్లు ప‌ద‌వికాలం ఉన్న‌ప్పుడే.. జ‌గ‌న్ ఆయ‌న‌ను ఎంచుకున్నారు. ఇది మంచిదే. ఇప్ప‌టికే ఆయ‌న రెండున్న‌రేళ్ల‌కు పైగానే డీజీపీ హోదాలో ప‌నిచేశారు. ఇది ఆయ‌న‌కు సంతృప్తినిచ్చే విష‌యమే. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో డీజీపీగా ప‌నిచేసిన‌వారు.. ఎవ‌రూ.. కూడా ఇంత‌కాలం ప‌నిచేయ‌లేదు.

పైగా సీఎం జ‌గ‌న్ డీజీపీ స‌వాంగ్‌కు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చార‌నేది వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే పోలీసులు త ప్పులు చేసినావారిపై కూడా కేసులు క‌ట్టేలా.. జైళ్ల‌కు పంపించేలా నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయితే.. స‌వాంగ్ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు మాత్రం క‌న్నీరు పెట్టుకుంటున్నాయి. ఏ అధికారిపైనైనా.. ప్ర‌భుత్వానికి అజ‌మాయిషీ ఉంటుంది. సో.. ఇప్పుడు అదే అధికారంతో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కోరిన‌ట్టు.. దీనికి వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. గ‌తంలో ఇదే ప‌వ‌న్‌.. స‌వాంగ్ హ‌ద్దులు మీరుతున్నార‌ని.. అన్నారు.

జ‌న‌సేనాని చెప్పిన‌ట్టు హ‌ద్దులు మీరిన అధికారిని బ‌దిలీ చేస్తే.. త‌ప్పేముంది? ఇక‌, మ‌రో కీల‌క విష‌యం.. స‌వాంగ్ సాధించిందేమీ లేద‌ని.. ప్ర‌చారం చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు కూడా ఆయ‌న‌ను వ‌ద‌ల‌డం లేద‌నే చెప్పాలి. ఆయ‌న చేసిన సంస్క‌ర‌ణ‌లు చూస్తే..  రాష్ట్రంలో ఏ స‌మ‌స్య వ‌చ్చి.. ఎవ‌రు ఆందోళ న‌ల‌కు సిద్ధ‌మైనా.. హ‌ద్దులు దాటినా.. పోలీసులు లాఠీలు ప‌ట్టుకోవ‌డం లేదు. ఇది గొప్ప సంస్క‌ర‌ణ‌. గ‌తంలో ఏ చిన్న ఉద్య‌మం జ‌రిగినా.. లాఠీ దెబ్బ‌లు, ర‌క్తాలు క‌నిపించేవి.  

లాఠీలు లేని పోలీసులను చూడ‌డం అంటే.. ఈ క్రెడిట్‌ పూర్తిగా స‌వాంగ్‌కే ద‌క్కుతుంది. అదేవిధంగా ఎఫ్ ఐఆర్ ల‌ను ఆన్‌లైన్ చేయ‌డం.. దిశ పోలీసు స్టేష‌న్ల‌లో సిబ్బందిని స‌ర్దుబాటు చేయ‌డం.. మ‌హిళ‌ల‌కు పోలీసుల‌కు మ‌ధ్య స‌యోధ్య ఏర్పాటు చేయ‌డం.. వంటివి స‌వాంగ్ తీసుకున్న నిర్ణ‌యాలు కావా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం స‌మంజ‌స‌మేనని.. అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: